తెలుగు అల్ రౌండర్
For every person wants
Tuesday, 10 January 2017
Thursday, 29 December 2016
Wednesday, 28 December 2016
Monday, 19 December 2016
uses of honey and garlic
పరకడుపున వెలుల్లి,తేనె
తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు....?
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతిరోజు
పరకడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా
తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే కొవ్వుని తొలగించి, గుండెకు
రక్తప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె
మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్‌ని
నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి
వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ
బ్యాక్టీరియల్ నేచర్ కోలన్‌లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ,
సైనసైటిస్‌లు దరిచేరవు. ఈ మిశ్రమంలోని యాంటీ బ్యాక్టీరియల్
గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.
శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి
బయటకు పంపుతుంది.
sleep for health
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే ….పొట్ట వస్తుందా ....?
ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని.. అదీ రోజుకు కనీసం 8 గంటల నిద్రమాత్రమే చాలునని వారు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట అర్థగంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు.
నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ
శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలి. నిద్రపోక ముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు.
women empower006
Free Hand brush workshop..in vijayawada
Subscribe to:
Posts (Atom)