Wednesday, 16 November 2016

prawns biryani


రొయ్యల బిర్యానీ

Image result for prawns biryani images

కావలసినవి:
 బాస్మతి బియ్యం- ఒక కేజీ,
 రొయ్యలు- కేజీన్నర,
Image result for prawns biryani imagesపెరుగు- 200 గ్రాములు,
నిమ్మరసం- మూడు టీస్పూన్లు,
కారంపొడి- 20 గ్రాములు,
 అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,
ఉప్పు- 50 గ్రాములు,
గరంమసాలా- 20 గ్రాములు,
రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు,
వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి) - 30 గ్రాములు,
జీడిపప్పు - కొద్దిగా,
కొత్తిమీర తరుగు - 15 గ్రాములు,
పుదీనా తరుగు - 15 గ్రాములు,
 బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు,
డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు,
నీళ్లు- 5 లీటర్లు

తయారీ విధానం:

 ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి. దీన్ని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి.

 నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి.


Image result for prawns biryani images ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. 
20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. ఈ రొయ్యల బిర్యానీ ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. అలా ఇష్టపడని వాళ్లు మిర్చి కా సలాన్‌ లేదా రైతాలతో బిర్యానీ లాగించేయచ్చు.

                                                                                                          

No comments:

Post a Comment

Comments system