Saturday, 26 November 2016

ulavacharu chicken biryani





ఉలవచారు చికెన్ బిర్యానీ
Image result for ulavacharu chicken biryani
కావలసిన పదార్థాలు :
 బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున,
Image result for ulavacharuఉలవచారు - అరకిలో,
నిమ్మకాయలు - రెండు,
ఉల్లిపాయలు (తరిగి),
పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున,
పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు,
 బిర్యానీ ఆకులు- నాలుగు,
నెయ్యి - వందగ్రాములు,
Image result for chicken meatబిర్యాని మసాలా దినుసులు, పసుపు - 50గ్రాములు,
ఉప్పు, కారం తగినంత. 

తయారీ విధానం : 

Related imageగిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగాక అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తరువాత అందులో అరకిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... ఉలవచారు బిర్యాని సిద్ధం.

No comments:

Post a Comment

Comments system