Showing posts with label తెలుగు వారి రుచులు. Show all posts
Showing posts with label తెలుగు వారి రుచులు. Show all posts

Thursday, 1 December 2016

paneer paratha



                        

                         పన్నీర్‌ పరోటా
Related image



కావలసిన పదార్థాలు: 

గోధుమ పిండి - రెండున్నర కప్పులు
నీళ్లు - తగినన్ని ,
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూను ,
ఉప్పు - తగినంత.
స్టఫింగ్‌ కోసం: పన్నీర్‌ - 200 గ్రా , పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు
కారం - అర టీస్పూను,
గరం మసాలా పౌడర్‌ - అర టీస్పూను.
ఆమ్‌చూర్‌ -అర టీస్పూను,
ఉప్పు - తగినంత 
నెయ్యి లేదా నూనె - తగినంత.
Image result for paneer paratha
తయారీ విధానం:


గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.
నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి. ఈలోగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి.
పచ్చిమిర్చి, ఆమ్‌చూర్‌, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్‌ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.
పరోటా పైన స్టఫింగ్‌ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్‌ ఉంచి స్టఫింగ్‌ పరుచుకోవాలి. తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.
తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.  

Methi paratha





మెంతి పరోటాRelated image
కావలసిన పదార్థాలు:
 గోధుమపిండి - 1 కప్పు,
శనగపిండి - 1 కప్పు,
 మెంతి తరుగు - 1 కప్పు,
 జీరాపొడి, దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున,
పసుపు - చిటికెడు,
Related image కారం - అర టీ స్పూను,
పచ్చిమిర్చి, అల్లం పేస్టు - 1 టీ స్పూను,
 పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత,
 నూనె - కాల్చడానికి సరిపడా .
తయారుచేసే విధానం:

పెరుగు తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసుకుని రెండు టేబుల్‌ స్పూన్ల నూనె చేర్చి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కనుంచాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. మీకిష్టమైన చట్నీతో వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. 

Saturday, 26 November 2016

ulavacharu chicken biryani





ఉలవచారు చికెన్ బిర్యానీ
Image result for ulavacharu chicken biryani
కావలసిన పదార్థాలు :
 బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున,
Image result for ulavacharuఉలవచారు - అరకిలో,
నిమ్మకాయలు - రెండు,
ఉల్లిపాయలు (తరిగి),
పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున,
పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు,
 బిర్యానీ ఆకులు- నాలుగు,
నెయ్యి - వందగ్రాములు,
Image result for chicken meatబిర్యాని మసాలా దినుసులు, పసుపు - 50గ్రాములు,
ఉప్పు, కారం తగినంత. 

తయారీ విధానం : 

Related imageగిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగాక అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తరువాత అందులో అరకిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... ఉలవచారు బిర్యాని సిద్ధం.

aloo rice special



ఆలూ రైస్
Image result for aalu rice images
కావలసిన పదార్థాలు: 
అన్నం- ఒక కప్పు,
బంగాళాదుంపలు (తరిగి)- రెండు,
 ఉల్లిపాయ(తరిగి)- ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు(తరిగి)- రెండు,                                                 
 పుదీనా తరుగు- రెండు టీస్పూన్లు,
Image result for aalu rice preparing images పచ్చిమిర్చి(తరిగి)- ఒకటి,
గరం మసాలా, షాజీరా - అర టీస్పూను,
 కారం- పావు టీస్పూను,
పసుపు- చిటికెడు,
నూనె, ఉప్పు- తగినంత.
బిరియానీ ఆకు, జాజికాయ- ఒకటి,
యాలకలు- నాలుగు,
దాల్చిన చెక్క- ఒక అంగుళం,
 లవంగాలు- ఆరు. 

తయారీ విధానం:

 బంగాళా దుంప ముక్కల్ని నీళ్లలో వేసి పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి బిరియానీ ఆకు, యాలకలు, లవంగాలు, షాజీరా, జాజికాయ, జాపత్రి వేసి వేయించాలి. దానిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. ఆ తరువాత బంగాళా దుంప ముక్కలు ఉడికే వరకు వేయించి, పసుపు, ఉప్పు, కారం, పుదీనా, గరం మసాలా వేసి కలపాలి. ఒకవేళ బంగాళా దుంప ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. అయితే నీళ్లు మొత్తం ఆవిరయ్యాక మాత్రమే దానిలో అన్నం వేయాలి. రెండు నిమిషాల తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tuesday, 22 November 2016

వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీ


వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీImage result for vankaya chinta chiguru curry images

కావలసినవి:
 వంకాయలు - అరకేజీ,
Image result for vankaya vegetableచింతచిగురు - ఒకటిం బావు కప్పు,
 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు,
 నూనె - పావు కప్పు,
Image result for vankaya chinta chiguru curry imagesపసుపు - చెంచా,
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి - ఐదు,
ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు,
ధనియాలపొడి - చెంచా,
జీల కర్ర - చెంచా,
శనగపప్పు - చెంచా,
ఆవాలు - చెంచా,
కూరకారం - అర చెంచా

Image result for vankaya chinta chiguru curry imagesతయారీ విధానం:
 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఆవాలూ, శనగపప్పును వేయించు కోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింతచిగురు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.


Monday, 21 November 2016

menthi paneer special


మెంతీ పనీర్ స్పెషల్
Image result for methi paneer images
కావలసిన పదార్థాలు:
చిన్నమెంతి తరుగు - 1 కప్పు,
Image result for methi paneer imagesపనీర్‌ తరుగు - ఒకటిన్నర కప్పు,
 టమోటా తరుగు - అర కప్పు,
అల్లం వెల్లుల్లి - అర టీ స్పూను,
కారం - అర టీ స్పూను,
గరం మసాల - అర టీ స్పూను,
 ఉల్లి తరుగు - అర కప్పు,
Image result for methi paneer imagesనిలువుగా చీల్చిన పచ్చిమిర్చి - 2,
 కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను,
పసుపు - చిటికెడు,
 నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం:

 కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి పనీర్‌ని కాసేపు వేగించి పక్కనుంచాలి. మిగిలిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, మెంతి తరుగు, అల్లం వెల్లుల్లి వేగించి టమోటా తరుగు, పసుపు వేసి సన్నని మంటపై ఉడికించాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాక కారం, ఉప్పు, వేగించిన పనీర్‌ కలిపి మరికాసేపు ఉడికించి గరంమసాల, కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకి చాలా బాగుంటుంది.Image result for methi paneer images

aloo bath recipe

               ఆలూ బాత్Image result for aloo bath images







 కావలసినవి:
 బంగాళాదుంపలు: 350 గ్రాములు,బియ్యం: 1 1/2కప్పు , 
పెరుగు: 1 కప్పు, 
జీడిపప్పు 150 గ్రాములు,
నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్స్‌,                                                                           
Image result for aloo bath imagesపసుపు :1/4 టేబుల్‌ స్పూన్‌,
 ఆలు వేగించడానికి తగినంత నూనె: ఉప్పు : సరిపడినంత.
 మసాలా పేస్టుకు:
పచ్చిమిరపకాయలు: 3, ధనియాలు: 2 టేబుల్‌ స్పూన్స్‌, అల్లం ముక్క : 1, దాల్చినచెక్క : 1, పైన చల్లడానికి: ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: కొద్దిగా.

తయారీ విధానం:

బంగాళాదుంప చెక్కు తీసి త్రికోణాకారంలో పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. నూనెలో వేసి బంగారు రంగొచ్చే వరకూ వేగించాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసి వేగించాలి. వాటిని ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి పది నిమిషాల పాటు నీళ్లలో నాన నివ్వాలి. మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి. నెయ్యి వేడి చేసి అందులో ఆ పేస్టుని వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి. మంటను తగ్గించి అందులో నానబెట్టిన బియ్యం, ఇతర మసాలా దినుసులు వేసి కాసేపు వేగించాలి. తర్వాత పెరుగు కలపాలి. చివరిగా వేగించిపెట్టుకున్న బంగాళాదుంపలు, జీడిపప్పులు ఆ బియ్యంలో కలిపి తగినంత నీటిని అందులో పోసి ఉప్పును కూడా జోడించి కుక్కర్‌లో పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్‌లోంచి దించిన ఈ ఆలూబాత్‌పైన కొబ్బరి పొడి, ధనియాల పొడి జల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Comments system