అత్తమ్మ సంతోషం...
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?"
అడిగింది కాంతం
"అందుకే నేను సంతోషంగా
వుండగలుగుతున్నాను..!"
అసలు విషయం చెప్పింది మంగమ్మ.
100 ముద్దులు పంపిస్తున్నాను....
జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు.
"ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
దీనికి భార్య నుంచి భర్తకు ప్రత్యుత్తరం అందింది. "మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ప్రతి రోజూ కనీసం 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా మీరేం కంగారు పడొద్దండీ.. మీరు పంపిన ముద్దుల్లో నా వద్ద ఇంకా 35 ముద్దులు మిగిలే వున్నాయి."
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."
No comments:
Post a Comment