Saturday 26 November 2016

ulavacharu chicken biryani





ఉలవచారు చికెన్ బిర్యానీ
Image result for ulavacharu chicken biryani
కావలసిన పదార్థాలు :
 బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున,
Image result for ulavacharuఉలవచారు - అరకిలో,
నిమ్మకాయలు - రెండు,
ఉల్లిపాయలు (తరిగి),
పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున,
పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు,
 బిర్యానీ ఆకులు- నాలుగు,
నెయ్యి - వందగ్రాములు,
Image result for chicken meatబిర్యాని మసాలా దినుసులు, పసుపు - 50గ్రాములు,
ఉప్పు, కారం తగినంత. 

తయారీ విధానం : 

Related imageగిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగాక అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తరువాత అందులో అరకిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... ఉలవచారు బిర్యాని సిద్ధం.

aloo rice special



ఆలూ రైస్
Image result for aalu rice images
కావలసిన పదార్థాలు: 
అన్నం- ఒక కప్పు,
బంగాళాదుంపలు (తరిగి)- రెండు,
 ఉల్లిపాయ(తరిగి)- ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు(తరిగి)- రెండు,                                                 
 పుదీనా తరుగు- రెండు టీస్పూన్లు,
Image result for aalu rice preparing images పచ్చిమిర్చి(తరిగి)- ఒకటి,
గరం మసాలా, షాజీరా - అర టీస్పూను,
 కారం- పావు టీస్పూను,
పసుపు- చిటికెడు,
నూనె, ఉప్పు- తగినంత.
బిరియానీ ఆకు, జాజికాయ- ఒకటి,
యాలకలు- నాలుగు,
దాల్చిన చెక్క- ఒక అంగుళం,
 లవంగాలు- ఆరు. 

తయారీ విధానం:

 బంగాళా దుంప ముక్కల్ని నీళ్లలో వేసి పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి బిరియానీ ఆకు, యాలకలు, లవంగాలు, షాజీరా, జాజికాయ, జాపత్రి వేసి వేయించాలి. దానిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. ఆ తరువాత బంగాళా దుంప ముక్కలు ఉడికే వరకు వేయించి, పసుపు, ఉప్పు, కారం, పుదీనా, గరం మసాలా వేసి కలపాలి. ఒకవేళ బంగాళా దుంప ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. అయితే నీళ్లు మొత్తం ఆవిరయ్యాక మాత్రమే దానిలో అన్నం వేయాలి. రెండు నిమిషాల తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

political news



జయలలితకు రోబోటిక్ థెరపీ.......?
              Related image

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. జయమ్మ సంపూర్ణంగా కోలుకున్నారని.. ఆమె డిశ్చార్జ్ అయ్యే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది జయలలితేనని ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి రోబోటిక్ యంత్రం చేరుకుందని.. అదీ అమ్మ చికిత్స పొందుతున్న గదికే దాన్ని తీసుకెళ్లినట్లు తమిళనాట వార్తలు వస్తున్నాయి. 

 Image result for jayalalitha latest hospital images
సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో రోబోటిక్ థెరపీ చికిత్సకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రోబోటిక్ థెరపీ చికిత్స ద్వారా అమ్మకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న ఫిజియోథెరపీకి రోబోటిక్ థెరపీ కూడా జత కానుందని అపోలో వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ సెప్టెంబ‌రు 22న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కాలర్ మైకు ద్వారా కొన్ని నిమిషాలు మాట్లాడారని అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి వెల్లడించారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డింద‌ని, ప్ర‌స్తుతం ఆమె కీలక అవయవాల‌ పనితీరు మెరుగ్గా ఉంద‌ని చెప్పారు.

జ‌య‌ల‌లిత‌కు చికిత్స‌లో భాగంగా ప్రతిరోజూ కొద్దిస‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుప‌త్రిలో ఆమె స్టాటిక్, యాక్టివ్ ఫిజియోథెరపీ తీసుకుంటుండటంతో కొన్ని రోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని చెప్పారు.


cini gossips




తమన్నాకు చాలదట.........     
Image result for tamanna hot dance
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను తన అందంతో షేక్ చేసిన సెక్సీ బ్యూటీ తమన్నా. ఈ హీరోయిన్ పేరు చెప్పగానే అంతా మిల్కీ బ్యూటీ అంటుంటారు. 

ఆమె గ్లామర్ అందం అలా ఉంటుంది మరి. బాహుబలి చిత్రంతో తన స్టామినా సూపర్ రేంజికి వెళ్లిపోయింది. ఇప్పుడు అమ్మడు కాల్షీట్లు కావాలంటే అంత తేలిక్కాదు. దానికితోడు గిరాకీ ఉన్నప్పుడే డిమాండ్ చేయాలనేది సినీ ఫీల్డులో ఉండనే ఉంది. అదే రూటులో తమన్నా నడుస్తోందట.
Related image
ఇంతకీ విషయం ఏమంటే... ఆమెను కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న న్యూ ఇయర్ బాష్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ చేసేందుకు అమ్మడికి రూ. 1.20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా... ప్చ్ అంటోందట. దీనితో నిర్వాహకులు మరో రేటుతో ఎలాగైనా ఆమెతో ఎలాగైనా డ్యాన్స్ చేయించాలని ప్రయత్నిస్తున్నారట.....


ustrasana yoga



ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ustrasana yoga)..
Image result for ustrasana yoga sex imagesసంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన)కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన)కు మధ్యస్థంగా ఉంటుంది.
Related image
 మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచండి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనండి. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. 

మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు అలాగే ఉండిపోవాలి. తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి మామూలుగా నీలింగ్ పొజిషన్‌కి వెళ్లండి. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించి నీలింగ్ పొజిషన్లో శరీరాన్ని గట్టిగా ఉంచండి.


ఉపయోగాలు...Image result for ustrasana yoga sex images

మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.
ఈ భంగిమను క్రమం తప్పకుండా చేస్తే ఫాటిగ్యూ, రుతుసంబంధ అసౌకర్యాన్ని, ఆత్రుతను నివారిస్తుంది.


cosmetics disadvantages




కాస్మోటిక్స్ వల్ల వచ్చే ఎలర్జీలు....తగ్గించే చిట్కాలు.......!
Image result for cosmetics images

ప్రస్తుతం వున్న కాలంలో మారుతున్న వాతావరణ సమస్యలు కారణంగా ప్రతి ఒక్కరి చర్మం పోడిగా,జిడ్డుగా మారుతుంది. దీని నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు వీలైనంతవరకు కాస్మోటిక్స్ ను వాడేస్తారు. కాస్మోటిక్స్ వాడినప్పుడు బాగానే వుంటుంది కాని ఫ్యూచర్ లో వీటి వల్ల అనేక నష్టాలే కాకుండా అలెర్జీలు కూడా చాలా అధికంగా వుంటాయట....

1. పార్లర్ వెళ్ళడం తగ్గించి,సింపుల్ గా మీ వల్లే అయిపోయే క్రీములను, సన్ లోషన్స్ వాడుకోవాలి. ఎందుకంటే పార్లర్ లో వారు వాడేవన్ని పుల్ కాస్మోటిక్ మెటిరియల్సే

2.పరిమిళ ద్రవాలు ఎక్కువగా వున్న పెర్ఫ్యూమ్స్ కన్నా మీ వంటి హాని చేయని వాటినే వాడండి.

3..సౌందర్య ఉత్పత్తులు ఎక్స్ పైరీ డేట్ అయిన తర్వాత అస్సలు వాడకూడదు.దీని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అధికం.
Related image
4. గోళ్ళకు రంగు వేయకూడదు ఎందుకంటే ఈ రంగులో ఫార్మాల్డిహైడ్ వుంటుంది. ఇది అలర్జీలను కలిగేలా చేస్తుంది.

5. వీలైనంతవరకు ఆయుర్వేద మూలకాలతో చేసిన సహాజ ఫేస్ ప్యాక్ లను వాడాలి.

6.మేకప్ వేసుకోనే ముందు, తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.

7.వీలైనంతవరకు సౌందర్య ఉత్త్పత్తులను వేడి గా వున్న ప్రాంతంలో కన్నా చల్లగా వున్న ప్రాంతంలో ఉంచాలి.


ఉసిరికాయ దాని ఉపయోగాలు.......




ఉసిరికాయ దాని ఉపయోగాలు.......
Related image
ఉసిరికాయ, ఈ పండు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటె చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండు ఇది.అంతే కాకుండా దీనితో చేసిన పచ్చడి కూడా బాగానే వుంటుండి. ఇకపోతే ఉసిరికాయ వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు వున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1.ఉసిరి శరీర ఉష్ణాన్ని, జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.          
               
Image result for uses of usirikaya images2.కాలేయ, లైంగిక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3.మెదడు పని తీరును మెరుగుపరచడమే కాకుండా ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది.

4.దీనిలోని విటమిన్ సి శరీరాన్ని ఎండవేడిమి నుంచి కాపాడుకోవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

5.జుట్టు సమస్యలకు ఉసిరి చక్కని సొల్యూషన్. దీనితో చుండ్రు,కేశ సంబంధిత సమస్యలు దరి చేరవు.

6.ఉసిరి వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.


Uses of water




ప్రతి రోజు మంచి నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు.....
                                     Image result for drinking water images
నీరు, మానవునికి బతకడానికి వుండాల్సిన వాటిలో చాలా ముఖ్యమైంది.ఇది లేకపోతే మానవుడు బతకడు అంటే పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే చాలా దేశంలో నీటి కోసం యుద్దాలే జరుగుతున్నాయి. ఇవన్ని పక్కన బెడితే మానవుని మనగుడకు ప్రతిరోజు కొంత నీరు అవసరమవుతుంది.ఇంత నీరు శరీరానికి అందింతేనే మనిషి ఆరోగ్యంగా,యాక్టివ్ గా వుండగలడు.ఇకపోతే నీటిని కావాల్సిన లెక్కలో తాగితే అనేక లాభాలు వుంటాయి......

1. శరీరంలో రక్త రవాణా, రక్తపు మూమెంట్ కు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

2.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా శరీరంలో చెడు పదార్దాలను తగ్గించి మూత్రం రూపంలో బయటకు వెళ్ళేలా చేస్తుంది.

3.ప్రతి మనిషి కచ్చితంగా మినిమం 3 లీటర్ల నీటిని తాగాలి. అంతే కాకుండా ఈ మూడు లీటర్లలో సగం మూత్రం రూపంలోనే పోతుంది.

Image result for drinking water images4. పొద్దునే ఒక గ్లాసు నీరు తాగితే కడుపు క్లీన్ గా వుండటమే కాకుండా జీర్ణశక్తి అధికంగా వుంటుంది.
5.ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగడంతో పాటు తడి గుడ్డను తలకు కట్టుకోని బయటకు వెళ్ళడం వల్ల వడ దెబ్బ సమస్యలు వుండవు.

6.ఎక్కువ వేడితో వున్న నీటిని వేసుకోవటం వల్ల శరీరం నల్లగా మారిపోతుంది.అదే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తక్కువగా వుంటాయి.


child care



పిల్లల ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రతలు......
Related image
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  

ప్రొటీన్స్‌, కార్భోహైడ్రెడ్స్‌...

Related image విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి.

కొవ్వు పదార్ధాలు...

కొవ్వు పదార్ధాలతో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.

గుడ్డు...

Image result for eggs images
కోడి గుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడి గుడ్డులోని నీలం తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది. వంద శాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలా మందికి తెలియదు. 11రకాల ఆవ్లూలు గుడ్డులోనే లభిస్తాయి.

మినరల్స్‌...

మినరల్‌ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కొల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ను రక్తంలో ఉండే ధాతువులు తక్కువ అయినా ప్రమాదమే. రక్తంను ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్‌ కీలక భూమిక పోషిస్తుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.

అయోడిన్‌...

అయోడిన్‌ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‌ తక్కువ అయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్ధులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. ప్రభుత్వం కూడా అయోడిన్‌, ఐరన్‌ కలసిన ఉప్పును మార్కెట్‌లో లభిస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు...
Image result for sprout images
మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బబ్బర్లుకర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసారికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. 

పిల్లలపై ప్రభావం:
Image result for dull child
- ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్ల లోపంతో విద్యార్ధులపై అనేక ప్రభావం చూపుతుంది.
- విద్యార్ధుల్లో తొందరగా అలసట రావడం.
- చదువులో వెనకబడడం.
- జ్ఞాపకశక్తి తగ్గడం.
- రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
- వ్యాధులు ఎప్పుడు వస్తాయి.
- దృష్టి లోపాలు వస్తాయి.
- దంతాలు, ఎముకల సమస్యలు.
- పుస్తకాల బ్యాగులు మోయలేకపోవడం.
- చురుగ్గా ఉండకపోవడం.
- క్రీడలపై నిరాసక్తి.

Thursday 24 November 2016

joke of day


అత్తమ్మ సంతోషం...
Image result for comedy images
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?"
అడిగింది కాంతం 
"అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!"
అసలు విషయం చెప్పింది మంగమ్మ.


100 ముద్దులు పంపిస్తున్నాను....

జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు. 
"ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
Related imageదీనికి భార్య నుంచి భర్తకు ప్రత్యుత్తరం అందింది. "మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ప్రతి రోజూ కనీసం 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా మీరేం కంగారు పడొద్దండీ.. మీరు పంపిన ముద్దుల్లో నా వద్ద ఇంకా 35 ముద్దులు మిగిలే వున్నాయి." 
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."





Wednesday 23 November 2016

women empower003

FREE SEWING MACHINE 

TRAINING PROGRAM: 



MAC welfare society, Vijayawada, Krishna District conducted free Sewing machine Training program to 40 slum Dwellers in R. R. Peta area. This program was conducted for a period of three months for the benefit of women residing on slum area for their self employment and livelihood promotion. It was inaugurated on 8th March 2015 by Smt. Jayalakshmi, Area corporator on the occasion of international women’s day celebrations. It was made known to all the women that tat should become active and effective steps need to be adopted for achieving socio economic empowerment and sustainable development. “It is possible only through professional education as well as skill development” as informed by the organizers. In this connection Smt. Minaakshi, President, MAC welfare society reiterated that women dress such as blouses, Nighties are made by learning sewing machine, readymade shops can be opened to sell the dresses and earn their livelihood. It was informed to them that their NGO would help them in getting orders for this purpose.     

Smt. Jayalakshmi, coporator of the area, While addressing the gathering said that 200 women came forward to extend their free services in sewing training programs for economic development of some women of the area. She felt very happy for organizing this training program for the benefit of slum dwellers. She promised that she would provide necessary help on behalf of Vijayawada Municipal Corporation.  She advised the members to learn tailoring and earn their livelihood in order to improve their economic status. All the members were happy to celebrate the women’s day. 


women empower 002


FREE TRAINING PROGRAM ON CRAFT, JUTE ART, COFFEE PAINTING AND SILPCAR   WORK:    


MAC welfare society conducted a training program on 20th Feb,2015 in Siddhartha Arts college , Kanuru. Total 70 college students participated actively in the training program with NGO members and college staff. The training program focused more attention on crafts, Jute art, coffee painting and silpkar work. Everybody have interest on learning crafts and arts. But they have internal fear that they cannot reach the goal. However they take more interest in their interested work rather than the other works. Generally college education is very burdensome to the students to them. So the students feel psychologically that they would loose creativity. However training programs would help to encourage them to fallow the right direction to improve their aptitudes and tastes on arts and crafts. If women are trained, they can stand on their own legs and earn their livelihood. Girl students   can pursue their arts and crafts of their interest even after they are married; in case they are not willing or their husbands are not willing send them outside from employment. Thus this type of training programs would definitely help a long way in their future. The NGO members informed that professional courses are useful and facilities would be provided by the organizations if necessary and without fees. The products made by them can be exhibited in the exhibitions and salable If the products are liked by the visitors.  The Organization would provide an opportunity to exhibit their artistic articles and handicrafts and also provide facilities for marketing.  The participants felt very happy for having undergone this type of training. 





Tuesday 22 November 2016

వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీ


వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీImage result for vankaya chinta chiguru curry images

కావలసినవి:
 వంకాయలు - అరకేజీ,
Image result for vankaya vegetableచింతచిగురు - ఒకటిం బావు కప్పు,
 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు,
 నూనె - పావు కప్పు,
Image result for vankaya chinta chiguru curry imagesపసుపు - చెంచా,
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి - ఐదు,
ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు,
ధనియాలపొడి - చెంచా,
జీల కర్ర - చెంచా,
శనగపప్పు - చెంచా,
ఆవాలు - చెంచా,
కూరకారం - అర చెంచా

Image result for vankaya chinta chiguru curry imagesతయారీ విధానం:
 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఆవాలూ, శనగపప్పును వేయించు కోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింతచిగురు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.


Comments system