Tuesday, 8 November 2016


చలికాలంలో మీ చర్మ సంరక్షణకు సహజమైన బాడీ లోషన్స్

Image result for natural body lotion images
బాడీ లోషన్స్ అనేవి వాడటం చాల సులభం, అదేవిధంగా తయారుచేసుకోవడం మరింత సులభం, ఒక్క 10-15 నిమిషాలు మీవి కావు అనుకుని చేసుకుంటే అందమైన మీ అందానికి కారణం అయ్యే బాడీ లోషన్స్ని మీరు తయారు చేసుకోవచ్చు.అదేవిధంగా వారి వారి కోరిక మేరకు మంచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటే, మీ చర్మం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది అనడంలో సందేహం లేదు.
మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే  పుదీనా , వనిల్లా , లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.

 “బాడీ లోషన్తయారు చేసుకునే విధానం చుసేద్దామ:

ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా,వారి శరీరానికి అనుకూలంగా ఈ బాడీ లోషన్తయారుచేసుకోవచ్చు, అయితే వీటి తయారీలో ముఖ్యమైనవి కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న, ని ఉపయోగిస్తే మీ పగిలిన పాదాలను, పొడి చర్మాన్ని  కాపాడుకోవచ్చు.
కావలసిన పదార్దాలు:
1/2 కప్పు బాదం (లేదా) ఆలివ్ నూనె
1/4 కప్పు కొబ్బరి నూనె
1/4 కప్పు మైనం
కావాలంటే 1 టీ స్పూన్ విటమిన్ “E”,  కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న కూడా ఉపయోగించవచ్చు.
తయారు చేసుకునే పద్దతి:
పైన సూచించిన వన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి, మరొక గిన్నెలో మీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపండి,మీ చర్మానికి పట్టించండి, మంచి ఫలితాలు లభిస్తాయి.

అందమైన చేతులు, శరీరం కోసం క్రీం:

మనకు అందుబాటులో ఉన్న వాటితో మన చేతులు, శరీరమును కాపాడుకోవడానికి మంచి క్రీం తయారు చేసుకోవచ్చు,ఇది అన్ని రకముల చర్మానికి ఉపయోగపడుతుంది .
ఈ విదంగా చేయండి:
1/4 కప్పు కొబ్బరి నూనె
Image result for natural body lotion images1/8 కప్ షియా వెన్న
1/8 కప్ కోకో వెన్న
1 టేబుల్ స్పూన్ కలబంద రసం
1 టేబుల్ స్పూన్ నూనె(బాదం, జొజోబా)
5-10 చుక్కల ముఖ్యమైన నూనెలు.
తయారు చేసుకునే పద్దతి:
షియా వెన్న, కొబ్బరి నూనె, కోకో వెన్న తీసుకుని వేడి చేసి కరగబెట్టాలి.
పైన మిశ్రమాన్ని కలబంద వేరా మరియు నూనె, కావాల్సిన పదార్దములు కలిపి, ఒక కొత్త మిశ్రమంగా మార్చుకుని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.
  షియా వెన్న మీ కఠినమైన చేతుల్ని అందంగా, మృదువుగా, మార్చి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.
 మేక పాలు, కలబంద మిశ్రమము:
మీ పొడిబారిన, జిడ్డైన చర్మ సం రక్షణకు ఈ మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది, అంతే కాకుండా దీని వల్ల ఏ రకమైన దుష్ప్రభావాలు ఉండవు.

No comments:

Post a Comment

Comments system