Monday, 5 December 2016

new note war


కేజ్రీవాల్ సవాల్......
Image result for kejriwal images
పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలన జరిగితే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు వల్ల కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలువురు ఉపాధి కోల్పోతున్నారు.. కానీ పీఎం మాత్రం పలుమార్లు దుస్తులు మార్చుకోవడంలో తీరికలేకుండా ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.

మోదీజీ.. మీరు ఏదైతే చెప్తున్నారో ముందు దాన్ని మీరు పాటించాలిఅని హితవు పలికారు. బవానాలోని వ్యాపారులతో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. నోట్ల రద్దు వల్ల అవినీతి సమసిపోతే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని నినదిస్తానని కేజ్రీవాల్‌ అన్నారు. మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ అభియాన్‌, యోగా దినోత్సవం, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను స్వాగతించాం. కానీ నోట్ల రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉంది, అందుకే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కువ రుణాలను తీసుకున్న పీఎం స్నేహితులకు మాత్రమే ఇది లాభదాయకంగా ఉందని విమర్శించారు. అనంతరం నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ఓ వీడియోను సీఎం కేజ్రీవాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.
50 రోజుల వ్యవధిలో ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని ప్రధాని మోదీ అంటున్నారు.. కానీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆరు నెలల సమయం పడుతుందంటున్నారు. 
Image result for modi kejriwal imagesఎప్పటిలోగా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో మోదీ, జైట్లీకే తెలియదని అన్నారు. ఓ బిచ్చగాడు స్వైపింగ్‌ మెషీన్‌ పట్టుకొని అడుక్కుంటున్నట్లు ఉన్న వాట్సాప్‌ వీడియో గురించి ప్రధాని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ ముందు భాజపా నగదు రూపంలో విరాళాలు తీసుకోవడం ఆపాలన్నారు. భాజపా 80 శాతం విరాళాలు నగదు రూపంలో తీసుకుంటుండగా, ఆప్‌ 92 శాతం పార్టీ విరాళాలను చెక్కులు, ఇతర మార్గాల ద్వారా తీసుకుంటుందన్నారు. రూ.2.5లక్షలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇస్తామని మోదీ ప్రకటించారు, కానీ ఆయన కేబినెట్‌ మంత్రులు, ఎంపీల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు రూ.2.5లక్షలే వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.


No comments:

Post a Comment

Comments system