Monday, 5 December 2016

arundhati pelli



అరుంధతి పెళ్లి.........
Image result for anushka shetty marriage photos


టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రస్తుతం అనుష్క బాహుబలి: ద కన్‌క్లూజన్‌’, ‘భాగమతివంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నదని ఈ కథనాలు ఉటంకిస్తున్నాయి.

Image result for anushka shetty marriage photosనిజానికి అనుష్క పెళ్లి గురించి గతంలో రకరకాల కథనాలు మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ టాలీవుడ్‌ నిర్మాతతో డేటింగ్‌ చేస్తున్నట్టు కూడా వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి గురించి తాజాగా చక్కర్లు కొడుతున్న కథనాలు ఎంతవరకు నిజమన్నది ధ్రువీకరించలేమని టాలీవుడ్‌ పరిశీలకులు అంటున్నారు.

దక్షిణాదిలో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క పెళ్లి వార్తలు నిజమైతే.. వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు ఈ సెలబ్రిటీ వివాహం కూడా వార్తల్లో నిలిచే అవకాశముంది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాల్లో నటిస్తోందో లేదోనని అప్పుడే ఆమె అభిమానులు బెంగ పెట్టుకున్నట్టు సోషల్‌ మీడియాలో కామెంట్లను బట్టి తెలుస్తోంది.

No comments:

Post a Comment

Comments system