Thursday 1 December 2016

paneer paratha



                        

                         పన్నీర్‌ పరోటా
Related image



కావలసిన పదార్థాలు: 

గోధుమ పిండి - రెండున్నర కప్పులు
నీళ్లు - తగినన్ని ,
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూను ,
ఉప్పు - తగినంత.
స్టఫింగ్‌ కోసం: పన్నీర్‌ - 200 గ్రా , పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు
కారం - అర టీస్పూను,
గరం మసాలా పౌడర్‌ - అర టీస్పూను.
ఆమ్‌చూర్‌ -అర టీస్పూను,
ఉప్పు - తగినంత 
నెయ్యి లేదా నూనె - తగినంత.
Image result for paneer paratha
తయారీ విధానం:


గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.
నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి. ఈలోగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి.
పచ్చిమిర్చి, ఆమ్‌చూర్‌, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్‌ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.
పరోటా పైన స్టఫింగ్‌ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్‌ ఉంచి స్టఫింగ్‌ పరుచుకోవాలి. తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.
తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.  

No comments:

Post a Comment

Comments system