Thursday, 29 December 2016
Wednesday, 28 December 2016
Monday, 19 December 2016
uses of honey and garlic
పరకడుపున వెలుల్లి,తేనె
తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు....?

వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతిరోజు
పరకడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా
తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే కొవ్వుని తొలగించి, గుండెకు
రక్తప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె
మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ని
నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి
వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ
బ్యాక్టీరియల్ నేచర్ కోలన్లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ,
సైనసైటిస్‌లు దరిచేరవు. ఈ మిశ్రమంలోని యాంటీ బ్యాక్టీరియల్
గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది.
శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి
బయటకు పంపుతుంది.
sleep for health
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే ….పొట్ట వస్తుందా ....?
ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని.. అదీ రోజుకు కనీసం 8 గంటల నిద్రమాత్రమే చాలునని వారు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట అర్థగంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు.
నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ
శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలి. నిద్రపోక ముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు.
women empower006

Free Hand brush workshop..in vijayawada



Monday, 5 December 2016
new note war
కేజ్రీవాల్ సవాల్......
పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలన జరిగితే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని భజన
చేస్తానని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న
నిర్ణయం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
నోట్ల రద్దు వల్ల కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలువురు ఉపాధి కోల్పోతున్నారు.. కానీ పీఎం మాత్రం పలుమార్లు దుస్తులు
మార్చుకోవడంలో తీరికలేకుండా ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
‘మోదీజీ.. మీరు ఏదైతే చెప్తున్నారో ముందు దాన్ని మీరు పాటించాలి’
అని హితవు పలికారు. బవానాలోని వ్యాపారులతో మాట్లాడుతున్న సమయంలో
కొంతమంది మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. నోట్ల రద్దు వల్ల అవినీతి సమసిపోతే
అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని నినదిస్తానని కేజ్రీవాల్ అన్నారు. ‘మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ అభియాన్, యోగా
దినోత్సవం, సర్జికల్ స్ట్రైక్స్‌ను స్వాగతించాం. కానీ
నోట్ల రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉంది, అందుకే
ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’మని
పేర్కొన్నారు. ఎక్కువ రుణాలను తీసుకున్న పీఎం స్నేహితులకు మాత్రమే ఇది లాభదాయకంగా
ఉందని విమర్శించారు. అనంతరం నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ఓ వీడియోను సీఎం
కేజ్రీవాల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
50 రోజుల వ్యవధిలో ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని ప్రధాని మోదీ అంటున్నారు.. కానీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆరు నెలల సమయం పడుతుందంటున్నారు.
50 రోజుల వ్యవధిలో ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని ప్రధాని మోదీ అంటున్నారు.. కానీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆరు నెలల సమయం పడుతుందంటున్నారు.
arundhati pelli
అరుంధతి
పెళ్లి.........

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు
ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి
చేసుకునే అవకాశముందని వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో
కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి:
ద కన్‌క్లూజన్’, ‘భాగమతి’ వంటి
ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నదని ఈ కథనాలు
ఉటంకిస్తున్నాయి.
దక్షిణాదిలో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క పెళ్లి
వార్తలు నిజమైతే.. వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు ఈ సెలబ్రిటీ వివాహం
కూడా వార్తల్లో నిలిచే అవకాశముంది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాల్లో నటిస్తోందో
లేదోనని అప్పుడే ఆమె అభిమానులు బెంగ పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లను
బట్టి తెలుస్తోంది.
Friday, 2 December 2016
Subscribe to:
Comments (Atom)



















.jpg)
.jpg)









