ఆఫ్ షోల్డర్
ఆఫ్ షోల్డర్ ఉత్తరాదిన ఎప్పుడో వచ్చింది కానీ.. మన దగ్గర
ఈ మధ్యనే హల్‌చల్ చేస్తోంది. నగరాల్లోనే కాదు, ఓ మోస్తరు
పట్టణాల్లోనూ అమ్మాయిలు ఆఫ్ షోల్డర్స్ మీద మోజు పెంచుకుంటున్నారు. ఈ మధ్యనే
హైదరాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న నటి త్రిష కూడా ఈ డ్రెస్‌ను వేసుకుని
కొత్తగా దర్శనమిచ్చింది. మీరు కూడా ఏదైనా వేడుకలకు వెళ్లినప్పుడో.. ప్రత్యేకంగా
కనిపించాలనుకున్నప్పుడో.. ఆఫ్ షోల్డర్ వేసుకోండి. ఆన్‌లైన్ షాపింగ్‌లో
బోలెడన్ని వెరైటీలు లభిస్తున్నాయి...
విస్కోస్ మెటీరియల్‌తో తయారైందీ బ్లాక్ ఆఫ్ షోల్డర్
టాప్. చాలా సింపుల్‌గా ఉండటం దీని ప్రత్యేకత. నెక్‌లైన్ మొత్తం ఎలాసి్ట్రక్
స్టిచ్ చేశారు. షార్ట్ స్లీవ్స్ ముచ్చటేస్తున్నాయి. బ్లాక్ టాప్ కాబట్టి
డెనిమ్ జీన్స్ మీద వేస్తే చూపు తిప్పుకోలేరు. అయితే ఇందులోకి హై హీల్స్ వాడితే
మీ వయసు అంతకంతకు తగ్గిపోతుంది. ఆన్‌లైన్ మార్కెట్‌లో దీని ధర సుమారు ఐదొందలు.
ఒక్కోసారి ఏ రంగు అయినా సరే.. నలుపు,తెలుపు వర్ణాల ముందు బోసిపోవాల్సిందే! ఈ రెండు రంగుల కాంబినేషన్‌ను
కలగలిపే డిజైన్ ఉండాలి కానీ.. అన్నిటికంటే అదే ఎక్కువ హుందాతనాన్ని
తీసుకొస్తుంది. నలుపు మీద తెల్లటి గీతలతో అల్లిన పువ్వులు మనకు ఎంత ప్రత్యేకతను
తీసుకొస్తాయో చెప్పలేము. సన్నగా, పొడుగ్గా ఉండే వారికి ఈ
డ్రెస్ పర్‌ఫెక్ట్. ధర సుమారు నాలుగు నుంచి ఆరొందలు.
No comments:
Post a Comment