వాట్సాప్ విడియో కాల్ కోసం ....!
వాట్సాప్ విడియో కాల్ అప్డేట్ ఇచ్చి నెలలు
గడుస్తున్నా, ఇప్పటికి చాలామందికి ఈ అప్డేట్
వచ్చినట్టు తెలిదు, తెలిసినవారిలో చాలామందికి విడియో కాల్
అప్డేట్ ఎలా పొందాలో తెలియదు. ఎందుకంటే, ఇది కేవలం ప్లే
స్టోర్ కి వెళ్లి అప్లికేషన్ అప్డేట్ చేసుకోగానే జరిగే పని కాదు.
మీకు వాట్సాప్
విడియో కాల్ ఆప్షన్ కావాలంటే, మీరు వాట్సాప్ బేటా వెర్షన్
వాడాల్సి వస్తుంది. అప్పుడే విడియో కాలింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక బేటా వెర్షన్ కి ఎలా
అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాం చూడండి.
చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీ స్టోర్ ఓపెన్
చేసి, వాట్సాప్ అని సెర్చ్ చేయండి. వాట్సాప్ పేజిలో
మీకు ఎప్పటిలాగే Uninstall, Open/Update ఆప్షన్స్
కనబడతాయి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే, సజేస్టేడ్
యాప్స్ కింద Become a beta tester అనే ఆప్షన్ కనబడుతుంది.
అక్కడ I’m in మీద క్లిక్ చేయాగానే మీ బేటా వెర్షన్
రిజిస్ట్రేషన్ మొదలవుతుంది.
కొంచెం సమయం తీసుకున్నాక, అక్కడే, అదే వాట్సాప్ పేజిలో మిమ్మల్ని ఫీడ్
బ్యాక్ అడుగుతుంది వాట్సాప్.
No comments:
Post a Comment