Monday, 5 December 2016

new note war


కేజ్రీవాల్ సవాల్......
Image result for kejriwal images
పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం నిర్మూలన జరిగితే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతోందని కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు వల్ల కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలువురు ఉపాధి కోల్పోతున్నారు.. కానీ పీఎం మాత్రం పలుమార్లు దుస్తులు మార్చుకోవడంలో తీరికలేకుండా ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.

‘మోదీజీ.. మీరు ఏదైతే చెప్తున్నారో ముందు దాన్ని మీరు పాటించాలి’ అని హితవు పలికారు. బవానాలోని వ్యాపారులతో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. నోట్ల రద్దు వల్ల అవినీతి సమసిపోతే అప్పుడు తాను కూడా మోదీ.. మోదీ అని నినదిస్తానని కేజ్రీవాల్‌ అన్నారు. ‘మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ అభియాన్‌, యోగా దినోత్సవం, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను స్వాగతించాం. కానీ నోట్ల రద్దుపై ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉంది, అందుకే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’మని పేర్కొన్నారు. ఎక్కువ రుణాలను తీసుకున్న పీఎం స్నేహితులకు మాత్రమే ఇది లాభదాయకంగా ఉందని విమర్శించారు. అనంతరం నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ఓ వీడియోను సీఎం కేజ్రీవాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.
50 రోజుల వ్యవధిలో ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని ప్రధాని మోదీ అంటున్నారు.. కానీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆరు నెలల సమయం పడుతుందంటున్నారు. 
Image result for modi kejriwal imagesఎప్పటిలోగా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో మోదీ, జైట్లీకే తెలియదని అన్నారు. ఓ బిచ్చగాడు స్వైపింగ్‌ మెషీన్‌ పట్టుకొని అడుక్కుంటున్నట్లు ఉన్న వాట్సాప్‌ వీడియో గురించి ప్రధాని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ ముందు భాజపా నగదు రూపంలో విరాళాలు తీసుకోవడం ఆపాలన్నారు. భాజపా 80 శాతం విరాళాలు నగదు రూపంలో తీసుకుంటుండగా, ఆప్‌ 92 శాతం పార్టీ విరాళాలను చెక్కులు, ఇతర మార్గాల ద్వారా తీసుకుంటుందన్నారు. రూ.2.5లక్షలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇస్తామని మోదీ ప్రకటించారు, కానీ ఆయన కేబినెట్‌ మంత్రులు, ఎంపీల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు రూ.2.5లక్షలే వినియోగిస్తున్నారా అని ప్రశ్నించారు.


arundhati pelli



అరుంధతి పెళ్లి.........
Image result for anushka shetty marriage photos


టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నదని ఈ కథనాలు ఉటంకిస్తున్నాయి.

Image result for anushka shetty marriage photosనిజానికి అనుష్క పెళ్లి గురించి గతంలో రకరకాల కథనాలు మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ టాలీవుడ్‌ నిర్మాతతో డేటింగ్‌ చేస్తున్నట్టు కూడా వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి గురించి తాజాగా చక్కర్లు కొడుతున్న కథనాలు ఎంతవరకు నిజమన్నది ధ్రువీకరించలేమని టాలీవుడ్‌ పరిశీలకులు అంటున్నారు.

దక్షిణాదిలో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క పెళ్లి వార్తలు నిజమైతే.. వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు ఈ సెలబ్రిటీ వివాహం కూడా వార్తల్లో నిలిచే అవకాశముంది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాల్లో నటిస్తోందో లేదోనని అప్పుడే ఆమె అభిమానులు బెంగ పెట్టుకున్నట్టు సోషల్‌ మీడియాలో కామెంట్లను బట్టి తెలుస్తోంది.

ileana images


Related image

Related image    Related image


Related image Related image

Related image


        Related image  Related image

Related image

Related image

Image result for ileana cool pics       Image result for ileana cool pics

                                Image result for ileana cool pics


                        Image result for ileana cool pics 

Image result for ileana cool pics

Related image

Image result for ileana cool pics                             
                             Related image



                     Related image
Image result for ileana cool pics

Friday, 2 December 2016

Thursday, 1 December 2016

paneer paratha



                        

                         పన్నీర్‌ పరోటా
Related image



కావలసిన పదార్థాలు: 

గోధుమ పిండి - రెండున్నర కప్పులు
నీళ్లు - తగినన్ని ,
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూను ,
ఉప్పు - తగినంత.
స్టఫింగ్‌ కోసం: పన్నీర్‌ - 200 గ్రా , పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు
కారం - అర టీస్పూను,
గరం మసాలా పౌడర్‌ - అర టీస్పూను.
ఆమ్‌చూర్‌ -అర టీస్పూను,
ఉప్పు - తగినంత 
నెయ్యి లేదా నూనె - తగినంత.
Image result for paneer paratha
తయారీ విధానం:


గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.
నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి. ఈలోగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి.
పచ్చిమిర్చి, ఆమ్‌చూర్‌, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్‌ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.
పరోటా పైన స్టఫింగ్‌ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్‌ ఉంచి స్టఫింగ్‌ పరుచుకోవాలి. తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.
తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.  

Methi paratha





మెంతి పరోటాRelated image
కావలసిన పదార్థాలు:
 గోధుమపిండి - 1 కప్పు,
శనగపిండి - 1 కప్పు,
 మెంతి తరుగు - 1 కప్పు,
 జీరాపొడి, దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున,
పసుపు - చిటికెడు,
Related image కారం - అర టీ స్పూను,
పచ్చిమిర్చి, అల్లం పేస్టు - 1 టీ స్పూను,
 పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత,
 నూనె - కాల్చడానికి సరిపడా .
తయారుచేసే విధానం:

పెరుగు తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసుకుని రెండు టేబుల్‌ స్పూన్ల నూనె చేర్చి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కనుంచాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. మీకిష్టమైన చట్నీతో వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. 

women empower


   women awareness and nutrition  program in                 Vijayawada.....









Nutrition progamme




Comments system