Tuesday, 22 November 2016

amir khan telugu movie




అమీర్ ఖాన్ తెలుగు సినిమా......యుద్ధం(దంగల్)
 Related image

Image result for dangal telugu movie  imagesఅమీర్ ఖాన్ సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చని భరోసా భారతీయ ప్రేక్షకులది. గత కొన్నేళ్లలో అద్భుతమైన సినిమాలతో ఇంకే హీరోకు లేని స్థాయిలో రెపుటేషన్ పెంచుకున్నాడు అమీర్. 3 ఇడియట్స్.. పీకే లాంటి సినిమాలతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది. అమీర్ కొత్త సినిమా 'దంగల్' కూడా గొప్ప సినిమాలాగానే కనిపిస్తోంది. హిందీలో ఆల్రెడీ రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ 'దంగల్.. యుద్ధం' పేరుతో రిలీజవుతోంది ఈ చిత్రం. నిన్నే తెలుగు పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ కూడా వదిలింది.
Image result for dangal movie poster

మహవీర్ పొగట్ అనే రెజ్లర్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా దంగల్. తాను సాధించలేకపోయిన స్వర్ణాన్ని తన కొడుకు ద్వారా సాధించాలనుకుంటాడు పొగట్. ఐతే అతడికి వరుసగా నలుగురు అమ్మాయిలే పుట్టడంతో నిరాశలో కూరుకుపోతాడు. ఐతే కూతుళ్లు ఇద్దరు కుర్రాళ్ల దుమ్ముదులపడంతో అతడి ఆలోచన మారుతుంది. అమ్మాయిల్ని రెజ్లర్లుగా ఎందుకు చేయకూడదు.. వాళ్లతో పతకాలు ఎందుకు సాధించకూడదు అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనెలా విజయవంతం అయ్యాడన్నది 'దంగల్ కథ. తెలుగు డబ్బింగ్ కూడా శ్రద్ధగానే చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అంకిత్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 23నప్రేక్షకుల ముందుకు రానుంది.

Black money viral




ప్రజలతో ఆడుకుంటున్న బ్లాక్ భూతం....
Image result for modi black money images

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదట్నుంచీ ఊపులో ఉన్న రియల్ రంగానికి బ్లాక్ మనీయే ఆయువుపట్టు. హైదరాబాద్ లో ఎప్పట్నుంచో రియల్ బూమ్ ఉండగా.. ఇప్పుడు ఏపీ అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ ఆకాశానికి దూసుకెళ్తోంది. విశాఖ, విజయవాడలో స్థలాలు, బాగా ఖరీదైపోయాయి.Related image
            
మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు భారీగా అంతరం ఉంటోంది. ఈ తేడాయే బ్లాక్ మనీగా మారుతోంది. ఇది ఏకంగా సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారి ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారింది.
           
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నగదు రూపంలో జరుగుతాయని అంచనా. రియల్ వ్యాపారులు ప్రభుత్వానికి, అటు వినియోగదారుడికి ఇద్దరికీ కుచ్చుటోపీ పెట్టి వాళ్లు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు.Image result for black money images
            
ముఖ్యంగా రియల్ బ్లాక్ భూతాన్నే కేంద్రం టార్గెట్ చేసిందనే వాదనలున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కట్టలపాములన్నీ బయటికొస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ బ్లాక్ బస్టర్లు కమిషన్ వ్యాపారులకు వరంగా మారాయి. వాళ్లు బ్లాక్ ను వైట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు
.

cinema gossips



అన్నయ్య కోసం తమ్ముడు......
Image result for chiru pawan latest images
చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య స్పర్ధలు తొలగిపోయి చాలా రోజులవుతున్నా కానీ అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. సర్దార్ గబ్బర్సింగ్ ఆడియోని చిరంజీవి లాంఛ్ చేసిన తర్వాత మెగా బ్రదర్స్ కలిసి కనిపించలేదు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం ప్రారంభోత్సవంలో కానీ, శ్రీజ పెళ్లిలో కానీ పవన్ జాడ లేదు. అయితే ఖైదీ నంబర్ 150 చిత్రం ఆడియో వేడుకకి పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ని కలిసి రామ్ చరణ్ ఈ సంగతి చెప్పాడని, పవన్ కూడా సానుకూలంగా స్పందించాడని సమాచారం. 
Image result for druvaha chiru pawan latest images

మెగాస్టార్ రీఎంట్రీ ఆడియో లాంఛ్లో మెగా హీరోలంతా వుండాలనేది రామ్ చరణ్ ఆలోచన. ఈ వేడుకని అత్యంత వైభవంగా చేయడానికి చరణ్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాడట. సాధారణ ఆడియో ఫంక్షన్ల మాదిరిగా కాకుండా దీనిని చాలా స్పెషల్గా చేసేందుకు గాను పలు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాడట. పవన్కళ్యాణ్తో సహా మొత్తం మెగా హీరోలంతా ఒకే వేదికపై వున్నట్టయితే ఇక ఆ దృశ్యం వీక్షించడానికి మెగా అభిమానులకి రెండు కళ్లు
సరిపోవేమో,,

women special -Different hair sytles


హెయిర్ స్టైల్స్ ఫర్ గర్ల్స్

1.           కర్లీ హెయిర్ స్టైల్స్(curly hair)
Image result for curly hair style images

If you have short and curly hairs you really need not to press your hairs like your cloth every time you are planning to go out. Get a natural and open hairstyle like this one and you are sure to look your best. Here the hairs have been parted at the side of the head and have been combed down. The rolled up portion of hairs at the front should also be noted as it gives the hairstyle a different touch. The addition of the floral accessory on the head adds to the overall look.
Image result for curly hair style images
Image result for curly hair style images Related imageImage result for curly hair style imagesImage result for curly hair style images
          Image result for curly hair style images Image result for curly hair style images

 2. Long wavy Hair styles for girls






winter special shrug


Image result for winter shrug



 అమ్మాయిలకు శీతాకాలంలో స్పెషల్ జాకెట్ ష్రుగ్(shrug)
Related image
Shrug is a very short woman’s jacket or sweater which is open in the front. It can be made in short sleeves or long sleeves. Long sleeve shrugs add a smart edge to most evening dresses and club wear. They provide warmth to the winter bride when worn on strapless or spaghetti straps bridal gown. The sleeves provide a light cover-up to the body. They can be worn on casual as well as formal dresses.  They are available in different materials, sizes and shapes.
Image result for winter shrug

This is a beautiful crochet lace light blue shrug with a delicate lacy pattern. It can be worn on shirts, jeans and skirts. They add grace to a simple casual wear that can be worn on holidays, camps and walks. The lace combined with the shrug looks really attractive and very well acquainted

 Image result for winter shrug

Image result for winter shrug

Image result for winter shrug

Image result for winter shrug



                                                                             

Monday, 21 November 2016

menthi paneer special


మెంతీ పనీర్ స్పెషల్
Image result for methi paneer images
కావలసిన పదార్థాలు:
చిన్నమెంతి తరుగు - 1 కప్పు,
Image result for methi paneer imagesపనీర్‌ తరుగు - ఒకటిన్నర కప్పు,
 టమోటా తరుగు - అర కప్పు,
అల్లం వెల్లుల్లి - అర టీ స్పూను,
కారం - అర టీ స్పూను,
గరం మసాల - అర టీ స్పూను,
 ఉల్లి తరుగు - అర కప్పు,
Image result for methi paneer imagesనిలువుగా చీల్చిన పచ్చిమిర్చి - 2,
 కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను,
పసుపు - చిటికెడు,
 నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం:

 కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి పనీర్‌ని కాసేపు వేగించి పక్కనుంచాలి. మిగిలిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, మెంతి తరుగు, అల్లం వెల్లుల్లి వేగించి టమోటా తరుగు, పసుపు వేసి సన్నని మంటపై ఉడికించాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాక కారం, ఉప్పు, వేగించిన పనీర్‌ కలిపి మరికాసేపు ఉడికించి గరంమసాల, కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకి చాలా బాగుంటుంది.Image result for methi paneer images

aloo bath recipe

               ఆలూ బాత్Image result for aloo bath images







 కావలసినవి:
 బంగాళాదుంపలు: 350 గ్రాములు,బియ్యం: 1 1/2కప్పు , 
పెరుగు: 1 కప్పు, 
జీడిపప్పు 150 గ్రాములు,
నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్స్‌,                                                                           
Image result for aloo bath imagesపసుపు :1/4 టేబుల్‌ స్పూన్‌,
 ఆలు వేగించడానికి తగినంత నూనె: ఉప్పు : సరిపడినంత.
 మసాలా పేస్టుకు:
పచ్చిమిరపకాయలు: 3, ధనియాలు: 2 టేబుల్‌ స్పూన్స్‌, అల్లం ముక్క : 1, దాల్చినచెక్క : 1, పైన చల్లడానికి: ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: కొద్దిగా.

తయారీ విధానం:

బంగాళాదుంప చెక్కు తీసి త్రికోణాకారంలో పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. నూనెలో వేసి బంగారు రంగొచ్చే వరకూ వేగించాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసి వేగించాలి. వాటిని ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి పది నిమిషాల పాటు నీళ్లలో నాన నివ్వాలి. మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి. నెయ్యి వేడి చేసి అందులో ఆ పేస్టుని వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి. మంటను తగ్గించి అందులో నానబెట్టిన బియ్యం, ఇతర మసాలా దినుసులు వేసి కాసేపు వేగించాలి. తర్వాత పెరుగు కలపాలి. చివరిగా వేగించిపెట్టుకున్న బంగాళాదుంపలు, జీడిపప్పులు ఆ బియ్యంలో కలిపి తగినంత నీటిని అందులో పోసి ఉప్పును కూడా జోడించి కుక్కర్‌లో పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్‌లోంచి దించిన ఈ ఆలూబాత్‌పైన కొబ్బరి పొడి, ధనియాల పొడి జల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Comments system