అన్నయ్య కోసం తమ్ముడు......
చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య
స్పర్ధలు తొలగిపోయి చాలా రోజులవుతున్నా కానీ అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించిన
సందర్భాలు చాలా తక్కువ. సర్దార్ గబ్బర్సింగ్ ఆడియోని చిరంజీవి లాంఛ్ చేసిన తర్వాత
మెగా బ్రదర్స్ కలిసి కనిపించలేదు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం ప్రారంభోత్సవంలో కానీ, శ్రీజ పెళ్లిలో కానీ పవన్ జాడ లేదు. అయితే ఖైదీ నంబర్ 150 చిత్రం ఆడియో వేడుకకి పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని ప్రచారం
జరుగుతోంది. ఇప్పటికే పవన్ని కలిసి రామ్ చరణ్ ఈ సంగతి చెప్పాడని, పవన్ కూడా సానుకూలంగా స్పందించాడని సమాచారం.
మెగాస్టార్ రీఎంట్రీ ఆడియో లాంఛ్లో మెగా హీరోలంతా వుండాలనేది రామ్ చరణ్ ఆలోచన. ఈ వేడుకని అత్యంత వైభవంగా చేయడానికి చరణ్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాడట. సాధారణ ఆడియో ఫంక్షన్ల మాదిరిగా కాకుండా దీనిని చాలా స్పెషల్గా చేసేందుకు గాను పలు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాడట. పవన్కళ్యాణ్తో సహా మొత్తం మెగా హీరోలంతా ఒకే వేదికపై వున్నట్టయితే ఇక ఆ దృశ్యం వీక్షించడానికి మెగా అభిమానులకి రెండు కళ్లు సరిపోవేమో,,
No comments:
Post a Comment