Monday, 21 November 2016

aloo bath recipe

               ఆలూ బాత్Image result for aloo bath images







 కావలసినవి:
 బంగాళాదుంపలు: 350 గ్రాములు,బియ్యం: 1 1/2కప్పు , 
పెరుగు: 1 కప్పు, 
జీడిపప్పు 150 గ్రాములు,
నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్స్‌,                                                                           
Image result for aloo bath imagesపసుపు :1/4 టేబుల్‌ స్పూన్‌,
 ఆలు వేగించడానికి తగినంత నూనె: ఉప్పు : సరిపడినంత.
 మసాలా పేస్టుకు:
పచ్చిమిరపకాయలు: 3, ధనియాలు: 2 టేబుల్‌ స్పూన్స్‌, అల్లం ముక్క : 1, దాల్చినచెక్క : 1, పైన చల్లడానికి: ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి: కొద్దిగా.

తయారీ విధానం:

బంగాళాదుంప చెక్కు తీసి త్రికోణాకారంలో పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. నూనెలో వేసి బంగారు రంగొచ్చే వరకూ వేగించాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసి వేగించాలి. వాటిని ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి పది నిమిషాల పాటు నీళ్లలో నాన నివ్వాలి. మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి. నెయ్యి వేడి చేసి అందులో ఆ పేస్టుని వేసి ఒక నిమిషంపాటు వేగనివ్వాలి. మంటను తగ్గించి అందులో నానబెట్టిన బియ్యం, ఇతర మసాలా దినుసులు వేసి కాసేపు వేగించాలి. తర్వాత పెరుగు కలపాలి. చివరిగా వేగించిపెట్టుకున్న బంగాళాదుంపలు, జీడిపప్పులు ఆ బియ్యంలో కలిపి తగినంత నీటిని అందులో పోసి ఉప్పును కూడా జోడించి కుక్కర్‌లో పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్‌లోంచి దించిన ఈ ఆలూబాత్‌పైన కొబ్బరి పొడి, ధనియాల పొడి జల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment

Comments system