అమీర్ ఖాన్ తెలుగు
సినిమా......యుద్ధం(దంగల్)
అమీర్ ఖాన్ సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్లకు
వెళ్లిపోవచ్చని భరోసా భారతీయ ప్రేక్షకులది. గత కొన్నేళ్లలో అద్భుతమైన సినిమాలతో
ఇంకే హీరోకు లేని స్థాయిలో రెపుటేషన్ పెంచుకున్నాడు అమీర్. 3 ఇడియట్స్.. పీకే లాంటి సినిమాలతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది. అమీర్
కొత్త సినిమా 'దంగల్' కూడా గొప్ప
సినిమాలాగానే కనిపిస్తోంది. హిందీలో ఆల్రెడీ రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన స్పందన
వచ్చింది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్
చేస్తున్నారు. తెలుగులోనూ 'దంగల్.. యుద్ధం' పేరుతో రిలీజవుతోంది ఈ చిత్రం. నిన్నే తెలుగు పోస్టర్ రిలీజ్ చేసిన
చిత్ర బృందం.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ కూడా వదిలింది.
మహవీర్ పొగట్ అనే రెజ్లర్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా దంగల్. తాను సాధించలేకపోయిన స్వర్ణాన్ని తన కొడుకు ద్వారా సాధించాలనుకుంటాడు పొగట్. ఐతే అతడికి వరుసగా నలుగురు అమ్మాయిలే పుట్టడంతో నిరాశలో కూరుకుపోతాడు. ఐతే కూతుళ్లు ఇద్దరు కుర్రాళ్ల దుమ్ముదులపడంతో అతడి ఆలోచన మారుతుంది. అమ్మాయిల్ని రెజ్లర్లుగా ఎందుకు చేయకూడదు.. వాళ్లతో పతకాలు ఎందుకు సాధించకూడదు అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనెలా విజయవంతం అయ్యాడన్నది 'దంగల్ కథ. తెలుగు డబ్బింగ్ కూడా శ్రద్ధగానే చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అంకిత్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 23నప్రేక్షకుల ముందుకు రానుంది.
No comments:
Post a Comment