మెంతీ పనీర్ స్పెషల్
కావలసిన పదార్థాలు:
చిన్నమెంతి
తరుగు - 1 కప్పు,
టమోటా తరుగు - అర కప్పు,
అల్లం
వెల్లుల్లి - అర టీ స్పూను,
కారం -
అర టీ స్పూను,
గరం మసాల
- అర టీ స్పూను,
ఉల్లి తరుగు - అర కప్పు,
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను,
పసుపు -
చిటికెడు,
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
ఉప్పు -
రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
కడాయిలో 1 టేబుల్ స్పూను నూనె వేసి పనీర్‌ని
కాసేపు వేగించి పక్కనుంచాలి. మిగిలిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి,
మెంతి తరుగు, అల్లం వెల్లుల్లి వేగించి
టమోటా తరుగు, పసుపు వేసి సన్నని మంటపై ఉడికించాలి. టమోటా
ముక్కలు మెత్తబడ్డాక కారం, ఉప్పు, వేగించిన పనీర్ కలిపి మరికాసేపు ఉడికించి గరంమసాల, కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment