Saturday, 26 November 2016

ఉసిరికాయ దాని ఉపయోగాలు.......




ఉసిరికాయ దాని ఉపయోగాలు.......
Related image
ఉసిరికాయ, ఈ పండు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటె చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండు ఇది.అంతే కాకుండా దీనితో చేసిన పచ్చడి కూడా బాగానే వుంటుండి. ఇకపోతే ఉసిరికాయ వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు వున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1.ఉసిరి శరీర ఉష్ణాన్ని, జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.          
               
Image result for uses of usirikaya images2.కాలేయ, లైంగిక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3.మెదడు పని తీరును మెరుగుపరచడమే కాకుండా ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది.

4.దీనిలోని విటమిన్ సి శరీరాన్ని ఎండవేడిమి నుంచి కాపాడుకోవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

5.జుట్టు సమస్యలకు ఉసిరి చక్కని సొల్యూషన్. దీనితో చుండ్రు,కేశ సంబంధిత సమస్యలు దరి చేరవు.

6.ఉసిరి వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.


Uses of water




ప్రతి రోజు మంచి నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు.....
                                     Image result for drinking water images
నీరు, మానవునికి బతకడానికి వుండాల్సిన వాటిలో చాలా ముఖ్యమైంది.ఇది లేకపోతే మానవుడు బతకడు అంటే పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే చాలా దేశంలో నీటి కోసం యుద్దాలే జరుగుతున్నాయి. ఇవన్ని పక్కన బెడితే మానవుని మనగుడకు ప్రతిరోజు కొంత నీరు అవసరమవుతుంది.ఇంత నీరు శరీరానికి అందింతేనే మనిషి ఆరోగ్యంగా,యాక్టివ్ గా వుండగలడు.ఇకపోతే నీటిని కావాల్సిన లెక్కలో తాగితే అనేక లాభాలు వుంటాయి......

1. శరీరంలో రక్త రవాణా, రక్తపు మూమెంట్ కు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

2.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా శరీరంలో చెడు పదార్దాలను తగ్గించి మూత్రం రూపంలో బయటకు వెళ్ళేలా చేస్తుంది.

3.ప్రతి మనిషి కచ్చితంగా మినిమం 3 లీటర్ల నీటిని తాగాలి. అంతే కాకుండా ఈ మూడు లీటర్లలో సగం మూత్రం రూపంలోనే పోతుంది.

Image result for drinking water images4. పొద్దునే ఒక గ్లాసు నీరు తాగితే కడుపు క్లీన్ గా వుండటమే కాకుండా జీర్ణశక్తి అధికంగా వుంటుంది.
5.ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగడంతో పాటు తడి గుడ్డను తలకు కట్టుకోని బయటకు వెళ్ళడం వల్ల వడ దెబ్బ సమస్యలు వుండవు.

6.ఎక్కువ వేడితో వున్న నీటిని వేసుకోవటం వల్ల శరీరం నల్లగా మారిపోతుంది.అదే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తక్కువగా వుంటాయి.


child care



పిల్లల ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రతలు......
Related image
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  

ప్రొటీన్స్‌, కార్భోహైడ్రెడ్స్‌...

Related image విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి.

కొవ్వు పదార్ధాలు...

కొవ్వు పదార్ధాలతో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.

గుడ్డు...

Image result for eggs images
కోడి గుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడి గుడ్డులోని నీలం తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది. వంద శాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలా మందికి తెలియదు. 11రకాల ఆవ్లూలు గుడ్డులోనే లభిస్తాయి.

మినరల్స్‌...

మినరల్‌ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కొల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ను రక్తంలో ఉండే ధాతువులు తక్కువ అయినా ప్రమాదమే. రక్తంను ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్‌ కీలక భూమిక పోషిస్తుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.

అయోడిన్‌...

అయోడిన్‌ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‌ తక్కువ అయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్ధులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. ప్రభుత్వం కూడా అయోడిన్‌, ఐరన్‌ కలసిన ఉప్పును మార్కెట్‌లో లభిస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు...
Image result for sprout images
మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బబ్బర్లు, కర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసారికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. 

పిల్లలపై ప్రభావం:
Image result for dull child
- ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్ల లోపంతో విద్యార్ధులపై అనేక ప్రభావం చూపుతుంది.
- విద్యార్ధుల్లో తొందరగా అలసట రావడం.
- చదువులో వెనకబడడం.
- జ్ఞాపకశక్తి తగ్గడం.
- రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
- వ్యాధులు ఎప్పుడు వస్తాయి.
- దృష్టి లోపాలు వస్తాయి.
- దంతాలు, ఎముకల సమస్యలు.
- పుస్తకాల బ్యాగులు మోయలేకపోవడం.
- చురుగ్గా ఉండకపోవడం.
- క్రీడలపై నిరాసక్తి.

Thursday, 24 November 2016

joke of day


అత్తమ్మ సంతోషం...
Image result for comedy images
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?"
అడిగింది కాంతం 
"అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!"
అసలు విషయం చెప్పింది మంగమ్మ.


100 ముద్దులు పంపిస్తున్నాను....

జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు. 
"ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
Related imageదీనికి భార్య నుంచి భర్తకు ప్రత్యుత్తరం అందింది. "మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ప్రతి రోజూ కనీసం 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా మీరేం కంగారు పడొద్దండీ.. మీరు పంపిన ముద్దుల్లో నా వద్ద ఇంకా 35 ముద్దులు మిగిలే వున్నాయి." 
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."





Wednesday, 23 November 2016

women empower003

FREE SEWING MACHINE 

TRAINING PROGRAM: 



MAC welfare society, Vijayawada, Krishna District conducted free Sewing machine Training program to 40 slum Dwellers in R. R. Peta area. This program was conducted for a period of three months for the benefit of women residing on slum area for their self employment and livelihood promotion. It was inaugurated on 8th March 2015 by Smt. Jayalakshmi, Area corporator on the occasion of international women’s day celebrations. It was made known to all the women that tat should become active and effective steps need to be adopted for achieving socio economic empowerment and sustainable development. “It is possible only through professional education as well as skill development” as informed by the organizers. In this connection Smt. Minaakshi, President, MAC welfare society reiterated that women dress such as blouses, Nighties are made by learning sewing machine, readymade shops can be opened to sell the dresses and earn their livelihood. It was informed to them that their NGO would help them in getting orders for this purpose.     

Smt. Jayalakshmi, coporator of the area, While addressing the gathering said that 200 women came forward to extend their free services in sewing training programs for economic development of some women of the area. She felt very happy for organizing this training program for the benefit of slum dwellers. She promised that she would provide necessary help on behalf of Vijayawada Municipal Corporation.  She advised the members to learn tailoring and earn their livelihood in order to improve their economic status. All the members were happy to celebrate the women’s day. 


women empower 002


FREE TRAINING PROGRAM ON CRAFT, JUTE ART, COFFEE PAINTING AND SILPCAR   WORK:    


MAC welfare society conducted a training program on 20th Feb,2015 in Siddhartha Arts college , Kanuru. Total 70 college students participated actively in the training program with NGO members and college staff. The training program focused more attention on crafts, Jute art, coffee painting and silpkar work. Everybody have interest on learning crafts and arts. But they have internal fear that they cannot reach the goal. However they take more interest in their interested work rather than the other works. Generally college education is very burdensome to the students to them. So the students feel psychologically that they would loose creativity. However training programs would help to encourage them to fallow the right direction to improve their aptitudes and tastes on arts and crafts. If women are trained, they can stand on their own legs and earn their livelihood. Girl students   can pursue their arts and crafts of their interest even after they are married; in case they are not willing or their husbands are not willing send them outside from employment. Thus this type of training programs would definitely help a long way in their future. The NGO members informed that professional courses are useful and facilities would be provided by the organizations if necessary and without fees. The products made by them can be exhibited in the exhibitions and salable If the products are liked by the visitors.  The Organization would provide an opportunity to exhibit their artistic articles and handicrafts and also provide facilities for marketing.  The participants felt very happy for having undergone this type of training. 





Tuesday, 22 November 2016

వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీ


వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీImage result for vankaya chinta chiguru curry images

కావలసినవి:
 వంకాయలు - అరకేజీ,
Image result for vankaya vegetableచింతచిగురు - ఒకటిం బావు కప్పు,
 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు,
 నూనె - పావు కప్పు,
Image result for vankaya chinta chiguru curry imagesపసుపు - చెంచా,
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి - ఐదు,
ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు,
ధనియాలపొడి - చెంచా,
జీల కర్ర - చెంచా,
శనగపప్పు - చెంచా,
ఆవాలు - చెంచా,
కూరకారం - అర చెంచా

Image result for vankaya chinta chiguru curry imagesతయారీ విధానం:
 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఆవాలూ, శనగపప్పును వేయించు కోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింతచిగురు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.


Comments system