Tuesday, 22 November 2016

వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీ


వంకాయ చింతచిగురు స్పెషల్ కర్రీImage result for vankaya chinta chiguru curry images

కావలసినవి:
 వంకాయలు - అరకేజీ,
Image result for vankaya vegetableచింతచిగురు - ఒకటిం బావు కప్పు,
 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు,
 నూనె - పావు కప్పు,
Image result for vankaya chinta chiguru curry imagesపసుపు - చెంచా,
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి - ఐదు,
ఎండుకొబ్బరిపొడి - రెండు టేబుల్‌ స్పూన్లు,
ధనియాలపొడి - చెంచా,
జీల కర్ర - చెంచా,
శనగపప్పు - చెంచా,
ఆవాలు - చెంచా,
కూరకారం - అర చెంచా

Image result for vankaya chinta chiguru curry imagesతయారీ విధానం:
 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఆవాలూ, శనగపప్పును వేయించు కోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి వంకాయముక్కలు కొద్దిగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింతచిగురు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగాక తగినంత ఉప్పూ, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గర అయ్యాక దింపేస్తే చాలు.


No comments:

Post a Comment

Comments system