ఆలూ రైస్
కావలసిన పదార్థాలు:
అన్నం-
ఒక కప్పు,
బంగాళాదుంపలు
(తరిగి)- రెండు,
ఉల్లిపాయ(తరిగి)- ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు(తరిగి)- రెండు,
పుదీనా తరుగు- రెండు
టీస్పూన్లు,
గరం
మసాలా, షాజీరా - అర టీస్పూను,
కారం- పావు టీస్పూను,
పసుపు-
చిటికెడు,
నూనె, ఉప్పు- తగినంత.
బిరియానీ
ఆకు, జాజికాయ- ఒకటి,
యాలకలు-
నాలుగు,
దాల్చిన
చెక్క- ఒక అంగుళం,
లవంగాలు- ఆరు.
తయారీ విధానం:
బంగాళా దుంప ముక్కల్ని
నీళ్లలో వేసి పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి బిరియానీ ఆకు, యాలకలు,
లవంగాలు, షాజీరా, జాజికాయ, జాపత్రి వేసి వేయించాలి. దానిలో
ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. ఆ
తరువాత బంగాళా దుంప ముక్కలు ఉడికే వరకు వేయించి, పసుపు,
ఉప్పు, కారం, పుదీనా,
గరం మసాలా వేసి కలపాలి. ఒకవేళ బంగాళా దుంప ముక్కలు
ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. అయితే నీళ్లు మొత్తం ఆవిరయ్యాక
మాత్రమే దానిలో అన్నం వేయాలి. రెండు నిమిషాల తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. దీన్ని రైతాతో కలిపి తింటే చాలా
రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment