అంబానీల్లానే మన
రాజకీయ నాయకులు సేఫ్ అయ్యారా ?..
లోకం అంతా ఇప్పుడు ఒకటే మాట! పెద్దనోట్ల రద్దు
వల్ల వాస్తవంగా నష్టపోయిందెవరు? అంటే అసలు
నల్లదొరల కంటే సామాన్యులేనన్న మాట వినిపిస్తోంది. చిల్లర లేక కడుపుకు
తిండిలేని ధైన్యం పేదలకు కలిగింది కానీ.. నల్ల డబ్బు పోగేసుకున్న బడా బాబులకేం
కాలేదన్న విశ్లేషణ సాగుతోంది.
నల్ల దొరలంతా ముందే జాగ్రత్త పడిపోయారు. తమ నల్ల డబ్బు మొత్తం స్వదేశంలో లేకుండా విదేశాలకు ముందే తొలగించారు. అక్కడ బినామీ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అలాగే స్థిరాస్తుల రూపంలోకి డబ్బును మార్చుకున్నారు. ఏదో ఒకరోజు నల్ల డబ్బుపై మోదీ ఎటాక్ ఉంటుందని గ్రహించిన పెద్దలంతా ముందే అత్యంత రహస్యంగా ఆస్తుల్ని ఖండాంతరాలకు తరలించారు. వేల కోట్ల ఆస్తుల్ని సేఫ్‌గా దాచిపెట్టుకున్నారు. రకరకాల బాండ్లు, విదేశీ కంపెనీల పేర్లతో షేర్ల రూపంలో దాచి పెట్టుకున్నారు. అందువల్ల వాళ్లకు వచ్చే నష్టమేమీ లేదు. ప్రస్తుతం సంపులో 500, 1000 నోట్ల రభస ముగిశాక తిరిగి వైట్ చేసుకునే మార్గాలెన్నిటినో ఇప్పటికే అన్వేషించారు.
భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాన్ని అయినా ముందస్తు ప్రణాళికతో
ఎదుర్కొనేందుకు నల్ల దొరలంతా ఎప్పుడో రెడీ అయిపోయారు. ఇప్పటికిప్పుడు మోదీ ప్రకటనతో
ఎవరూ నష్టపోలేదు. అంబానీల నుంచి గాలి జనార్థన్ రెడ్డి, సుజనా చౌదరి, వైయస్ జగన్ ఇంత మంది పెద్దలు
తమ డబ్బును సురక్షిత పెట్టుబడుల్లోకి మార్చుకున్నారు. ఇంపోర్ట్ అండ్ ఇన్‌వాయిసింగ్
పద్ధతుల్లో ఇదివరకే విదేశీ అకౌంట్లలోకి డబ్బును మళ్లించేశారు. అందుకే ఏ ఎటాక్‌కి
అదరక బెదరక తాపీగా ఉన్నారంతా. వేల కోట్లు, లక్షల
కోట్లలో నష్టం అయితే లేదు. కేవలం కద్దోగొప్పో ఇంట్లో ఖర్చులకు దాచుకున్నవి,
రాజకీయ అవసరాలకు దాచుకున్నవి పని మనుషుల ద్వారా వైట్‌గా
మారిపోతాయి. మినహా అక్కడా వచ్చే నష్టమేమీ లేదు. .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా,
తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు గుమిగూడినా విస్త్రతంగా ముచ్చటించుకుంటున్న
లోకోక్తి ఇది.
No comments:
Post a Comment