బేబీ కార్న్ పకోడి
కావలసిన పదార్థాలు:
మైదా - ఐదు టేబుల్
స్పూన్లు,
బేబీకార్న్ - పది,
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్
స్పూన్,
మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్
స్పూన్లు,
వెల్లుల్లి రెబ్బలు-
ఆరు,
అల్లం - చిన్న ముక్క,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం:
బేబీకార్న్ నిలువుగా
రెండు భాగాలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి,
అల్లంలను మిక్సీ వేసుకోవాలి. అందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉప్పు, మసాలా పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి నీళ్లతో
పకోడి పిండిలా కలపాలి. ఈ పిండిలో బేబీకార్న్ ముక్కల్ని ముంచి నూనెలో వే సి బంగారు
రంగు వచ్చే వరకు వేగించాలి. వేడివేడిగా తింటుంటే కరకరమంటూ బాగుంటాయి.
No comments:
Post a Comment