Sunday, 20 November 2016

sunday special palak parota



పాలక్‌ పరోటా
 Related image
కావలసిన పదార్థాలు: 

Image result for palak paratha imagesగోధుమపిండి - 2 కప్పులు 
పాలకూర - 250 గ్రా,
పచ్చిమిర్చి - 2
వాము - అర టీస్పూను ,
నెయ్యి లేదా నూనె - 2 టీస్పూన్లు 
ఉప్పు, నూనె - తగినంత

తయారీ విధానం: 

పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

నీళ్లు వేడిచేసి పాలకూర వేసి 7 నిమిషాలు మరిగించి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. 
చల్లారాక బ్లెండర్‌లో వేసి గుజ్జు చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, సోంపు, పచ్చిమిర్చి, పాలకూర గుజ్జు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను ఉండలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి.
 
తర్వాత ఒక అంచుని లోపలికి మడిచి నూనె పూసి ఒత్తుకుని ఇంకో అంచుని లోపలికి మడవాలి. ఇలా పరోటాను త్రికోణాకారంలో ఒత్తుకోవాలి. వేడి పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకుని వేడిగా వడ్డించాలి.
Image result for palak paratha images

No comments:

Post a Comment

Comments system