చింత చిగురు పచ్చిరొయ్యలు
కావలసిన పదార్థాలు:
చింతచిగురు - పావు కేజీ,
పచ్చిరొయ్యలు - అరకేజీ,
ఉల్లిపాయలు
- 3,
పచ్చిమిర్చి
- 4,
నూనె - 3 టేబుల్
స్పూన్లు,
పసుపు -
అర టీ స్పూను,
కారం - 1 టీ స్పూను,
ఉప్పు -
తగినంత.
తయారుచేసే విధానం:
పచ్చిరొయ్యలు, చింతచిగురు విడివిడిగా శుభ్రం
చేసి ఉంచుకోవాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు దోరగా
వేగించి పసుపు, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి. రొయ్యలు మూడు
వంతులు ఉడికిన తర్వాత చింతచిగురు, కారం, ఉప్పు కలిపి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు పోసి మూత పెట్టాలి. కూర
చిక్కబడ్డాక దించేయాలి. (చింతచిగురు రుచి తెలియాలి కాబట్టి మసాల పొడి, కొత్తిమీర లాంటివి వాడకూడదు. మటన్, చికెన్‌లతో
కూడా ఇలాగే కలిపి వండుకోవచ్చు. వీటిలో మాత్రం అల్లం వెల్లుల్లి, మసాల పొడి వాడాలి).
No comments:
Post a Comment