Friday 11 November 2016

kidneys problems and it remidies


కిడ్నీలోని రాళ్ళను సులభంగా కరిగించండి

Image result for kidney stone images

ముత్ర పిండాలలో రాళ్ళు ఒచ్చాయి అందుకే మందులు వాడుతున్నాము అని సర్జరీ చేయలన్నారని అనడం తరచుగా వింటూ ఉంటాం మనం. ఇక కిడ్నీలో రాళ్ళు ఒచ్చిన వారి బాధ వర్ణనాతీతం. నడుము భాగంలో నొప్పితో విలవిలలాడి పోతారు. ఇక కొంత మంది సర్జరీ చేపించుకోవడానికి లక్షలలో ఖర్చు చేస్తున్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం మన పెరట్లో దొరికే వాటితోనే కిడ్నీలోని రాళ్ళను కరిగించు కోవొచ్చు. ఆ కిటుకులు మీకోసం.

F అరకప్పు నిమ్మరసంను రెండు కప్పుల నీటిలో కలపాలి. ఉదయం ఓ కప్పు నిమ్మరసం.. సాయంత్రం ఓ కప్పు నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ తో రాళ్లు కరగటం ప్రారంభమవుతుంది. కొద్ది రోజులకు రాళ్లు పడిపోతాయి.
F
పసుపును, బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్లరేణువులు పడిపోతాయి .
F
పల్లేరు కాయలు (గోక్షుర) సేకరించి, నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి, పొడి చేసి వస్తగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని అర టీస్పూన్ తేనె కలిపి, గొర్రె పాలతో వారంపాటు తీసుకుంటే మూత్రపిండాల రాళ్లు కరిగిపోతాయి.

Image result for kidney stone images
F
కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్దిరోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి.
F
దోసగింజలను, కొబ్బరిపువ్వునూ పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్లు, చిన్నచిన్న రేణువులు పడిపోతాయి.
 పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో పది రోజులపాటు ఉదయం, ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్లుకూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకు వచ్చేస్తాయి. కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్లు, రాళ్ల రేణువులు బయటకు వెళ్లిపోయి ఉపశమనం లభిస్తుంది.
F
దోశగింజలనూ నక్కదోశ గింజలనూ ముద్దగా నూరి ద్రాక్షపండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి.
F
బూడిద గుమ్మడికాయలు, బూడిదగుమ్మడిపూల స్వరసంలో యవక్షారాన్ని, బెల్లాన్నీ కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
.
F
పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి ఏడు రోజులు గొర్రెపాలతో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి.
 మునగచెట్టు (శిగ్రు) వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్లు పడిపోతాయి.
 Image result for kidney stone images

చేదు ఆనపకాయ గింజల (కటుతుంబీ) చూర్ణాన్ని తేనెతో కలిపి గొర్రెపాలతో ఏడు రోజులపాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయి
.

No comments:

Post a Comment

Comments system