'వియ్'ని
ప్రారంభించిన మంచు లక్ష్మి
హైదరాబాద్: ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళా సాధికారత సాధ్యమని సినీ నటి మంచు లక్ష్మి సోమవారం నాడు అన్నారు. తాజ్ డెక్కన్‌లో ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను (వియ్) ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
విద్యాతో మహిళలు సమాజంలో ముందుకెళ్లవచన్నారు.
ఫిక్కి మహిళా సాధికారత దిశలో చేపడుతున్న కార్యక్రమాలు హర్షనీయమన్నారు. ఎడ్యుకేషన్
ఫర్ చేంజ్ పేరిట స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు
ఇంగ్లిషును బోధిస్తున్నట్లు చెప్పారు. పది స్కూళ్లలో ప్రారంభమై ఈ ప్రయత్నం
ప్రస్తుతం వెయ్యిమంది వాలంటీర్లతో వంద స్కూళ్లకు విస్తరించిందని చెప్పారు.
త్వరలోనే బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఈ
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర కూడా పాల్గొన్నారు.
సదస్సులో మంచు లక్ష్మి
మాట్లాడుతూ... స్త్రీల సాధికారతను పెంచుకునే క్రమంలో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని
నిలబడి, అన్ని రంగాల్లో ముందుకు పోవాలన్నారు.
జగదీశ్వర మాట్లాడుతూ... విద్యా సంస్థల్లో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలున్నాయన్నారు. వియ్ ఇన్ ఎడ్యుకేషన్ జాతీయ బాధ్యురాలు వాసవి భరత్ రామ్ మాట్లాడుతూ ఫిక్కి మహిళల భద్రత, ఉపాధి అవకాశాల లక్ష్యంతో వియ్ ఇన్ ఎడ్యుకేషన్‌ని ప్రారంభించిందన్నారు.
No comments:
Post a Comment