Tuesday 15 November 2016

importance of music




సంగీతం తో ముడిపడి ఉన్న మన ఆరోగ్యం
Image result for music images
అలోచనలు పెంచే శక్తి సంగీతానికి ఉంది, బాధల్ని తుంచే శక్తి సంగీతానికి ఉంది. మనిషి పడుతున్న కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి కొన్ని నిమిషాల పాటు విముక్తినిచ్చి, మరో ప్రపంచంలోకి మోసుకెళ్ళగల బలం సంగీతంలో ఉంది. అందుకే సంగీతాన్ని కూడా ఒక వైద్యంలా పరిగణించారు మన పూర్వీకులు. ఇప్పటికి కొన్నిరకాల మానసిక రోగాలకి మ్యూజిక్ థెరపి పేరుతో సంగీతాన్ని ఉపయోగించి ట్రీట్‌మెంటు ఇస్తారు. అంత గొప్పదైన సంగీతం, క్యాన్సర్ పై కూడా ఒక ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు గట్టిగా చెవుతున్నాయి.
Image result for music images

ఇటివలే ఇదే విషయంపై అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో ఒక పరిశోధన చేశారు. అందులో 3700 మందికి పైగా క్యాన్సర్‌ పేషెంట్లు పాల్గొన్నారు. వారందరికీ ఆహ్లాదకరమైన సంగీతంతో మ్యూజిక్ థెరపి అందించగా, మంచి ఫలితాలు కనిపించాయి. నొప్పిని, భయాన్ని, అలసటని తగ్గించడానికి సంగీతం సహాయపడింది. అలాగే పేషెంట్ల బ్లడ్ ప్రెషర్, రెస్పిరేటరీ రేట్ కూడా కంట్రోల్ లోకి వచ్చింది.
Image result for music images
ఈరకంగా క్యాన్సర్ పేషెంట్లు వాడాల్సిన ఔషధాలలో మ్యూజిక్ కూడా ఉందని, ఇది మంచి ఫలితాలను రాబడుతుందని నిరూపితమైంది. మ్యూజిక్, మెడిసిన్ .. ఈ రెండిటి అద్భుతమైన కలయికలో క్యాన్సర్‌ పేషెంట్లకు మంచి వైద్య సేవలను అందించవచ్చునని యూనివర్సిటీ పరిశోధకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే ఏలాంటి క్యాన్సర్‌ కు ఎలాంటి సంగీతం, ఎలాంటి పద్ధతిలో వినిపించాలి అనే విషయం మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వారు చెప్పుకొచ్చారు.


No comments:

Post a Comment

Comments system