గోంగూర బిర్యానీ
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు,
గోంగూర- రెండు కప్పులు,
అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ
స్పూను,
తరిగిన ఉల్లిపాయ- ఒకటి,
తరిగిన పచ్చిమిర్చి- ఆరు,
కొత్తిమీర- రెండు టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు- ఆరు,
బిర్యానీ ఆకు- ఒకటి,
లవంగాలు- నాలుగు,
దాల్చిన చెక్క- చిన్న ముక్క,
యాలకులు- ఒకటి,
నెయ్యి- ఒక టేబుల్ స్పూను,
నూనె- ఒక టేబుల్ స్పూను,
ఉప్పు- తగినంత.
తయారీ విధానం:
బాణలిలో నూనె పోసి గోంగూరను ఉడికించి, మెత్తగా
రుబ్బి పక్కనపెట్ట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు,
బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేగించాలి.
తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మరో నిమిషం సేపు వేగించాలి.
తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచి వాసన వచ్చేదాకా వేగించాలి. ఆ తర్వాత
గోంగూర కూడా వేసి బాగా కలిపిన తర్వాత బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి
మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
No comments:
Post a Comment