Tuesday, 15 November 2016

akhil movies



అక్కినేని అఖిల్ సినిమాలు ఉన్నాయా లేదా ...?  
Image result for akhil images

Image result for akhil images22 ఏళ్ళ అఖిల్ సినిమాల్లోకి హీరోగా వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అవును, తన తొలి చిత్రం, అఖిల్ ది పవర్ ఆఫ్ జువా వచ్చి ఏడాదయ్యింది. ఈపాటికి మరో హీరో ఉండుంటే కనీసం రెండు సినిమాలైనా విడుదల చేసి, మూడోవ సినిమా దాదాపుగా పూర్తి చేసేసేవాడు. కాని మన అఖిల్ మాత్రం ఇంకా రెండొవ సినిమా మొదలుపెట్టనే లేదు.
 
అసలు అఖిల్ కి సినిమాల మీద ఇంటరెస్ట్ లేదని కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని వారి సీనియర్ అభిమానులు. ఏదో స్టార్ డమ్ ఎంజాయ్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాడే తప్ప, కథల పట్ల స్పష్టత కాని, సినిమా మీద ప్రేమ కాని లేదని బాధపడుతున్నారు ఫ్యాన్స్.
 
Image result for sad faces images logo
వంశీ పైడిపల్లి అఖిల్ వయసుకి తగ్గట్టుగా మంచి యూత్ ఫుల్ కథతో వస్తే, ముప్పుతిప్పలు పెట్టాడట అఖిల్. ఓ మూడు నాలుగు నెలలు వంశీని తిప్పించుకోని, తన సినిమా కాదని, మళ్ళీ హను రాఘవపూడితో సినిమా అన్నౌన్స్ చేసి, దాన్ని కూడా ఆపేశాడు. ఇప్పుడు విక్రమ్ కుమార్ తో సినిమా ప్రకటించి కూడా కొన్ని నెలలు గడుస్తున్నాయి. అయినా, ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేది ఎవరికి అర్థం కావడం లేదు.

ఇవన్నిపోను, అఖిల్ సినిమాల మీద మనసుపెట్టకుండా, అప్పుడే నిశ్చితార్థం, పెళ్ళి అని తొందరపడటం అక్కినేని ఫ్యాన్స్ అస్సలు నచ్చట్లేదు. అఖిల్ మీద నాగచైతన్య నయం అని, సమంత లాంటి హీరోయిన్ తో ప్రేమలో ఉన్నా, పర్సనల్ విషయాలు ఎప్పుడు తన కెరీర్ కి అడ్డంకులుగా మారలేదని వాపోతున్నారు అభిమానులు.

No comments:

Post a Comment

Comments system