చింత చిగురు పొడి
కావలసిన పదార్థాలు:
చింతచిగురు
- 1 కప్పు,
ఎండుమిర్చి - 10,
కరివేపాకు
- 4 రెబ్బలు,
ఇంగువ -
పావు టీ స్పూను,
మినప్పప్పు
- 1 కప్పు,
వెల్లుల్లి
రేకలు - 10,
నూనె -
అర టీ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:
చింతచిగురు
శుభ్రం చేసి కడిగి ఆరబెట్టి దోరగా వేగించి పక్కనుంచాలి. శనగపప్పు, మినప్పప్పు
విడివిడిగా వేగించాలి. నూనెలో ఎండుమిర్చి, వెలుల్లి రేకలు,
కరివేపాకు, ఇంగువ వేగించాలి. అన్ని
పదార్థాలనూ చల్లారిన తర్వాత ఉప్పు జతచేసి మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి.
పుట్నాలు, పల్లీలు, నువ్వుల పొడి
మాదిరే ఈ పొడి వేడి అన్నంలో నెయ్యితో పాటు కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment