శ్రీదేవి కూతురు....సినిమాలోకి
అలనాటి అందాల శ్రీదేవికి ఏమాత్రం తగ్గని అందగత్తె ఆవిడ
కూతురు జాహ్నవి కపూర్. 19 ఏళ్ళ ఈ అమ్మాయిని సినిమాల్లోకి లాగాలని
చాలామంది ప్రయత్నించారు కాని, అప్పుడే తొందర ఎందుకులే అని
శ్రీదేవి జాహ్నవి సినిమా ఎంట్రీని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, మరింత ఆలస్యం చేయట్లేదు.
అవును, జాహ్నవి కపూర్ తెరంగ్రేటం కన్ఫర్మ్
అయిపోయింది. బాలివుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో జాహ్నవి వెండితెరకు
పరిచయం కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా జాహ్నవి తండ్రి, శ్రీదేవి
భర్త బోణి కపూర్ మీడియాకి తెలియజేశారు.
ఈ మధ్యే మరాఠి సినిమా సైరత్ రీమేక్ హక్కులను
చేజిక్కించుకున్న కరణ్ జోహర్, బహుషా జాహ్నవి హీరోయిన్ గా ఆ
సినిమాని నిర్మిస్తాడేమో! చూద్దాం, జాహ్నవి తన తల్లిలాగే
అగ్రశ్రేణి కథానాయికగా ఎదుగుతుందో లేదో.....
No comments:
Post a Comment