Thursday, 17 November 2016

నువ్వుల Noodles special


Image result for sesame noodles imagesరుచికరమైన నువ్వుల నూడుల్స్ తయారీ..!


నూడుల్స్‌ని మనందరమూ తినాలనుకుంటాము.పైగావీటిని రకరకాలుగా తయారు చేయవచ్చు.హాంకాంగ్ స్టైల్ నూడుల్స్ కారంగా ఉంటే కాంటోనీస్ స్టైల్ నూడుల్స్ కారం లేకుండా లైట్‌గా ఉంటాయి. మామూలు నూడుల్స్‌కే కాస్త మార్పులు చేసి రుచికరంగా మార్చే సీసమే నూడుల్స్ తయారీ మీకు ఈరోజు పరిచయం చెయ్యబోతున్నాము.

దీనిని ఈవెనింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు పైగా దీని తయారెకై కావాల్సిన పదార్ధాలు కూడా సులభంగా దొర్కేవే.ఇక తయారీ విధానం, కావాల్సిన పదార్ధాలు చూద్దామా. సీసమే సీడ్స్ లేదా నువ్వులు బలవర్ధకమైన ఆహారం.

కావాల్సిన పదార్ధాలు:
Image result for sesame images1.ఉడికించిన నూడుల్స్-2.5 కప్పులు
 2.సన్నగా తరిగిన వెల్లుల్లి-1 టేబుల్ స్పూను
 3.తెల్ల నువ్వులు-1 టేబుల్ స్పూను
4.సన్నగా తరిగిన అల్లం-1 టేబుల్ స్పూను
5.వెనిగర్-1 టేబుల్ స్పూను
6.ఉల్లికాడల తరుగు-1 టేబుల్ స్పూను
 7.డార్క్ సోయా సాస్-1 టీ స్పూను
8.నువ్వుల నూనె-1 టేబుల్ స్పూను
9.ఉప్పు-రుచికి తగినంత
 తయారీ విధానం:
Image result for sesame noodles images 1.నువ్వులని కనీసం రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద నూనె లేకుండా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.
2.ఇప్పుడు అదే మూకుడులో నువ్వుల నూనె వేసి దానిలో అల్లం,వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి
3. .అల్లం, వెల్లుల్లి వేగాకా దానిలో ఉడికించిన నూడుల్స్, సోయా సాస్, వెనిగర్ వెయ్యాలి.
4. .ఇప్పుడు బాగా కలిపి పైన వేయించిన నువ్వులు కలపాలి.కాసిని నువ్వులు గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవడం మర్చిపోవద్దు సుమా
5.ఇప్పుడు మళ్ళీ కలిపి కాసేపు స్టవ్ మీదే ఉంచాలి.
6. నూడుల్స్ ఇతర పదార్ధాలతో కలిసి బాగా ఉడికాకా నూడుల్స్‌ని నూడుల్స్ బౌల్లోకి తీసుకోవాలి.
 
7.వీటిమీద ఉల్లి కాడల తరుగు, గార్నిషింగ్ కోసం పెట్టుకున్న నువ్వులూ చల్లాలి.

Image result for sesame noodles images

No comments:

Post a Comment

Comments system