పెదాలను
మృదువుగా మార్చే గ్లిసరిన్
పెదాలను మృదువుగా మారుస్తుంది
తేమను అందించే గుణాలను
గ్లిసరిన్ కలిగి ఉంటుందని అందరికి తెలిసిందే. పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు
ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లిసరిన్ ను శీతాకాలంలో వాడటం వలన మంచి
ఫలితాలను పొందవచ్చు. శీతాకాలంలో పెదాలు పగలటం మరియు కొన్ని సార్లు రక్త స్రావం
కూడా జరగవచ్చు,
ఇలాంటి సమయంలో గ్లిసరిన్ అన్ని విధాల సహాయపడుతుంది.
పెదాలను
గులాభి రంగులోకి మారుస్తుంది
సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల అలవాట్ల పెదాలు ముదురు
రంగులోకి మారతాయి. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ సహాయపడుతుంది. రోజు రాత్రి పడుకునే
ముందు గ్లిసరిన్ ను అప్లై చేసి పడుకొని, ఉదయాన మీ పెదాలను చూడండి.
పెదాలకు తేమను అందిస్తుంది
పెదాలపై ఉండే చర్మం పలుచగా చాలా సున్నితంగా ఉంటుంది కావున
ముఖ: చర్మానికి తీసుకునే జాగ్రత్తల కన్నా వీటికి మరింత జాగ్రత్త తీసుకోవాలి.
సాధారణంగా వాడె లిప్ బామ్ లు కొన్ని గంటలలోనే వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ
గ్లిసరిన్ పూర్తి రోజు పెదాలకు తేమను అందిస్తుంది. కావున కృత్రిమ లిప్ బామ్ లకు
బదులుగా గ్లిసరిన్ ను వాడటం మంచిది.
No comments:
Post a Comment