Thursday 10 November 2016

liver cancer and remedies



ఉల్లిపాయతో అండాశయ క్యాన్సర్‌కు చెక్

అండాశయ క్యాన్సర్! ఏటా లక్షకు పైగా స్త్రీల ప్రాణాలను హరించే మాయదారి. అతి ప్రాణాంతకరమైన క్యాన్సర్లలో ఇదీ ఒకటి. దీని బారినవారిలో 40 శాతం మంది మాత్రమే ఐదేళ్లకు మించి జీవితాన్ని చూడగలుగుతారు. కానీ ఇలాంటి ఉపద్రవానికి ఉల్లిపాయలు నివారణగా నిలిచే అవకాశం ఉందని తేలడం అద్భుతమే కదా! ఆ అద్భుతం నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.

Image result for liver cancer images

భయపెట్టే గణాంకాలు

స్త్రీలలో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కేవలం ఒక్క శాతమే ఉంటుంది. కానీ వంశంలో కనుక ఈ వ్యాధి ఉంటే, ఆ ఒక్క శాతం అవకాశం కాస్తా 40 శాతంగా మారిపోతుంది. ఇక ఊబకాయం, సంతానలేమి, హార్మోన్ థెరపీ వంటి మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్ దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది. అండాశయ క్యాన్సర్తో వచ్చే లక్షణాలని ఏదో రుతుసంబంధమైన ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేసే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా ఆదిలోనే తుంచగలిగే ఈ వ్యాధి ముదిరిపోతుంది. అప్పటివరకూ అండాశయానికి మాత్రమే పరిమితమై ఉన్న క్యాన్సర్ కణాలు శరీరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తాయి. పైగా ఒకసారి ఈ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నాక 80 శాతం మందిలో ఇది మళ్లీ తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. వైద్య సదుపాయాలు అరకొరగా ఉండే మనలాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరెంత ప్రాణాంతకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

 ఉల్లిపాయ వైద్యం

జపానుకి చెందిన కుమనోటో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఉల్లిపాయలో ఉండే ‘On onion A’ (ONA) అనే రసాయనాన్ని ఎలుకల మీద ప్రయోగించారు. వీరి ప్రయోగంలో అండాశయ క్యాన్సర్ని నివారించడంలో ఈ ONA అనేకరకాలుగా తోడ్పడుతుందని తేలింది.
 Image result for liver cancer images
మన శరీరంలోని macrophages అనే రక్షణ వ్యవస్థ క్యాన్సర్ కణాల మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో క్యాన్సర్ కణాలది పైచేయిగా మారినప్పుడు అవి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం మొదలుపెడతాయి. కానీ ONA అనే రసాయనం శరీరంలోకి చేరిన తరువాత క్యాన్సర్ కణాల వృద్ధి గణనీయంగా తగ్గిపోయినట్లు తేలింది.
-
 ఒకవైపు క్యాన్సర్ కణాలు మన శరీర రక్షణ వ్యవస్థ మీద దాడి సాగిస్తుండగానే, MDSC అనే కణాలు కూడా వాటికి తోడై మన రక్షణ వ్యవస్థని బలహీనపరుస్తాయి. ONA రసాయనంతో ఈ MDSC కణాలు నిర్వీర్యం కావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.
-
 ఉల్లిపాయలోని ఈ ONA శరీరాన్ని లోలోపల్నుంచే రక్షించడమే కాకుండా, క్యాన్సర్తో పోరాడేందుకు వాడుతున్న మందులు మరింత ప్రభావవంతంగా పనిచేయడంలోతోడ్పడ్డాయట.
-
 అప్పటివరకూ అండాశయానికి పరిమితమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకు సోకకుండా కూడా ONA అడ్డుకోవడాన్ని గమనించారు.
Image result for liver cancer images
  
కొత్త ఆశలు

ఇప్పటివరకూ అండాశయ క్యాన్సర్ వస్తే దాని నివారించడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. ఈ భయంతోనే కొందరు ముందుగానే అండాశయాన్ని తొలగించుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలను భరిస్తున్నారు. కానీ ఈ తాజా పరిశోధనతో అండాశయ క్యాన్సర్ను ఖచ్చితంగా నివారించవచ్చన్న ఆశలు మొదలయ్యాయి. ఈ ONA రసాయనం వల్ల ఉపయోగం ఉందంటూ అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యలోకం అంగీకరిస్తే కనుక ONAతో కూడిన మందులు త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



No comments:

Post a Comment

Comments system