Wednesday, 9 November 2016

chintachiguru mutton special


పసుపు - చెంచా, 


చింతచిగురు మటన్  కర్రీ స్పెషల్
Image result for chinta chiguru mutton curry images

కావలసినవి:
 మటన - అరకేజీ, 
Image result for chinta chiguru images అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు, 
ఉప్పు - తగినంత, 
చింతచిగురు - కప్పు, 
ఉల్లిపాయలు - రెండు, 
పచ్చిమిర్చి – 3
లవంగాలు- 3, 
దాల్చినచెక్క - చిన్న ముక్క, 
Image result for mutton meat imagesకారం - టేబుల్‌ స్పూన, 
నూనె - పావుకప్పు, 
గరం మసాలా - టేబుల్‌స్పూన్, 
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం: 
కుక్కర్‌లో మటన ముక్కలూ, అల్లంవెల్లుల్లి పేస్టూ, పసుపూ, కొద్దిగా ఉప్పు, చిన్న కప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. నాలు గైదు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. తరువాత ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలూ వేసి వేయించాలి. ఉల్లి పాయ ముక్కలు వేగాక కడిగిన చింతచిగురు, తగినంత ఉప్పు వేసి మంట తగ్గించేయాలి. కాసేపటికి చింతచిగురు ఉడుకుతుంది. అప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటనతో పాటు కారం, గరంమసాలా వేసి బాగా కల పాలి. ఇది గ్రేవీలా అయ్యేందుకు మరికాసిని నీళ్ళు పోసి కొన్ని నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

No comments:

Post a Comment

Comments system