యూరఫ్‌లో చిరంజీవి
సినిమా ఖైదీ
నంబర్:150
హైదరాబాద్: మెగాస్టార్ ఖైదీ నంబర్ 150
(బాస్ ఈజ్ బ్యాక్) జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి
తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. ఈ చిత్రంలో
చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్
నిర్మిస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ .. అన్న ట్యాగ్‌లైన్‌కి తగ్గటే ఇప్పటికే
పోస్టరులు
యువతరంలోకి దూసుకెళ్లిపోయాయి.
ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణకు యూరప్ వెళుతున్నాం.
స్లోవేనియా, క్రొయేషియా (సెంట్రల్ యూరప్) లాంటి అరుదైన
దేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.
జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్
జానీ మాష్టర్, శేఖర్ మాష్టర్ ఈ పాటలకు కొరియోగ్రఫీ
అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ చరణ్
తెలిపారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు
తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
జాతీయ అవార్డ్ గ్రహీత తోటతరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు.
No comments:
Post a Comment