మహేషతో పోటీగా సమంతా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అది కూడా హీరోయిన్ సమంత.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇది సాధ్యమే. అయితే మీరనుకుంటున్నట్లు సినిమా కలెక్షన్లలో కాదు. ట్విట్టర్‌లో ‘ఫ్యాన్స్’ కలెక్షన్లలో. అవును. సాధారణంగా మహేశ్‌కి ట్విట్టర్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలా అరుదుగా మహేశ్ ట్వీట్ చేసినప్పటికీ ఫాలోవర్స్ మాత్రం ఎక్కువే. అయితే ఈ రికార్డును సమంత బ్రేక్ చేసింది. మహేశ్‌కు ట్విట్టర్ ఫాలోవర్స్ 2.5 మిలియన్స్ అయితే, సమంతకు 3మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే మహేశ్ కన్నా 5లక్షల ఫాలోవర్స్ ఎక్కువన్నమాట. అంటే మహేశ్ రికార్డును సమంత బ్రేక్ చేసినట్టే కదా! దీనంతటికీ కారణం ఏమిటంటే, మహేష్ ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా ట్వీట్ చేస్తుంటాడు కానీ సమంత మాత్రం సంవత్సరంలో ప్రతిరోజూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. దానికి తోడు ఈ భామ అక్కినేని హీరోను పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు.
No comments:
Post a Comment