పాపం సినిమా వాళ్ల కష్టాలు
హైదరాబాద్:
|
ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద
తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ
..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా
ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట.
వాస్తవానికి మన తెలుగులో కాదు దేశంలోని
అన్ని లాంగ్వేజ్ ల్లోనూ చాలా మంది హీరోలు బ్లాక్ ఇంత, వైట్ ఇంత అని
రెమ్యునేషన్ ని తీసుుకుంటూంటారు. నిర్మాతలకు అదే వెసులు బాటుకావటంతో బ్లాక్ మనీ
విచ్చలవిడిగా పరిశ్రమలో తిరిగుతూంటుంది. ఆ డబ్బు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ
రియల్ ఎస్టేట్ రంగంలోకి అందులోంచి మళ్లీ సినీ పరిశ్రమలోకి వస్తుంది.
దాంతో చాలా మంది హీరోల వద్ద బ్లాక్ మనీ అనేది కామన్. దానికి తోడు రెమ్యునేషన్స్ విపరీతంగా పెరగటంతో బ్లాక్ అనేది , టాక్స్ కట్టకుండా తప్పించుకోవటానికి ఓ మార్గం అయ్యింది. ఈ నేపధ్యంలో ప్రధాని తీసుకున్న ఈ నోట్ల కట్ల రద్దు వ్యవహారం ఇలాంటి వారందిరికీ సమస్య తెచ్చి పెట్టింది.
1000 నోట్లు ఇక ప్రస్తుత విషయానికి వస్తే...ఆ స్టార్ హీరో దగ్గర ఓ రియల్
ఎస్టేట్ డీల్ కోసం దాచిన పాతిక కోట్లు .. దాదాపు అన్ని వెయ్యి
రూపాయల నోట్లు డినామినేషన్ తో ఉన్నాయిట ఇంట్లో. ఓ రెండు రోజుల్లో షంషాబాద్ వద్ద ఓ
సెటిల్మెంట్ కోసం తెచ్చిన డబ్బు...ఇప్పుడు ఏం చేయాలా అనే సమస్యలో పడేసిందిట.
మొత్తం బ్లాక్ మనీ లెక్క చెప్దాము అంటే...దానికి లెక్కలు లేవు. అది బ్లాక్ మనీట. ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే..ఆయన బయిట వారితో మీడియావారితో మాత్రం మోదీ తెచ్చిన ఈ మార్పు అద్బుతమని పొగుడుతూమాట్లాడుతున్నారట. లోపల ఏడుస్తూ..బయిటకు నవ్వుతూ ఇలా ఆ స్టార్ హీరో నిన్నటినుంచీ నటిస్తున్నాడట.
పద్దతి మార్చుకుంటారా :
మరోవైపు
భారీగా రెమ్యుషన్ అందుకొనే హీరో, హీరోయిన్, దర్శకులు...
కొంతమొత్తాన్ని బ్లాక్‌లో ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారట. ఇప్పుడు వాళ్ల మాటేంటి?
ఇక ఆ పద్ధతి మార్చుకోవాల్సిందే అంటూ పరిశ్రమలో గుసగుసలు
వినిపిస్తున్నాయి.
ఓ నటుడు అయితే
‘‘ఇప్పటికి షాకింగ్‌గా అనిపించినా కొద్ది రోజులు పోతే అనూహ్యమైన మార్పులు
వచ్చే అవకాశం ఉంది. పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు... అని ప్రతీ ఒక్కరూ బలంగా
ఫిక్స్ అయిపోతారు. ఈ పరిణామంతో పారితోషికాలు తగ్గుతాయి అనుకోవడం లేదు. అవి
ఎప్పట్లా కొనసాగే అవకాశాలున్నాయి. నా సినిమాలో నటించిన ఓ నటుడు తన పారితోషికంలో
దాదాపుగా 80 శాతం బ్లాక్‌లోనే ఇమ్మని డిమాండ్ చేశాడు.
ఇప్పుడు ఆ అవకాశమే లేదు. ఇదీ ఒకందుకు మంచిదే. పేపర్‌పై అన్ని లెక్కలూ పక్కాగా
ఉంటాయి. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అయితే ఈ రెండు రోజులు షూటింగులు
చేసుకొనేవారి పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. గురువారం నుంచి ‘ఫ్యాషన్ డిజైనర్' షూటింగ్ ఉంది. రోజువారి
వేతనాలు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు''అన్నారు.
No comments:
Post a Comment