Saturday 19 November 2016

uses of Yoga


యోగ సాధనతో  కొవ్వు మాయం

యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం...ఉదయం పూట మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అన్పించినప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి.లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి.ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాలు తర్వాత యోగాను మొదలుపెట్టాలి.ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగావల్ల డప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ నీరసించకూడదు
Image result for kati chakrasana images

కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం
కటి అంటే కృశోధరము లేదా నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. 

ఆసనం వేయు పద్దతి
Image result for kati chakrasana images

చదునైన నేలపై నిటారుగా నిలబడాలి.
 
తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి.
 
చూపు ఎదురుగా ఉండాలి.
చేతులను ముందుకు చాపాలి.
 
అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి.
 
ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి..
Image result for kati chakrasana images
అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. 
ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.
అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి.
 
కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి.
 
ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి.
 
ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.
 


జాగ్రత్తలు
భుజం, కృశోధరం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.
ఉపయోగాలు 
ఈ ఆసనం వలన తొడలు, నడుము, తుంటలలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.

No comments:

Post a Comment

Comments system