Friday, 11 November 2016

uses of water

  పరగడుపున నీళ్లు తాగడంవల్ల కలిగే 
Image result for drinking water family images
  ప్రయోజనాలు తెలుసా !
ఉదయాన నిద్రలేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
మీకు తేలుసా ......!

Image result for drinking water family images

1. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.
2. 
ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరం.
3. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

భోజనం చేశాక.. పొట్ట నిండిపోయేలా నీటిని తాగేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి
Image result for drinking water family images
శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడదని వారు చెప్తున్నారు. పరగడుపున రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. పరగడుపున తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి చేకూరుతుంది. ఇలా రోజూ చేస్తే శరీరంలోని మలినాలు వెలివేయబడుతాయి. 

అలాగే ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నీటిని సేవించడం మంచిది కాదు. ఆహారం తీసుకున్న వెంటనే పొట్ట నిండేలా నీటిని సేవిస్తే.. అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీటిని తాగకూడదు. నీటికి బదులు మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు కాసిన్ని నీరు సేవించండి. పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.  

నీరసంగా ఉన్నప్పుడు మన మెదడులో నీరు 75 శాతం మాత్రమే ఉందని గమనించాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినన్ని నీరు సేవించాలి. నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా నీటిని సేవించడాన్ని మరిచిపోకూడదు. అయితే సాయంత్రం పూట తక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు వ్యాయామానికి అనంతరం నీటిని తీసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి.

అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు నీటిని సేవించడం మంచిది. గర్భిణీ మహిళలు, బాలింతలు అధికంగా నీటిని తీసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిగిలిన వారు రోజుకు 8 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.

Image result for drinking water family images

No comments:

Post a Comment

Comments system