అన్నపూర్ణ స్టూడియోస్
బ్యానర్ లో రాజతరుణ్ కొత్త సినిమా
నాగార్జున బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిచయం అయిన
యంగ్ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా అయిన రాజ్ తరుణ్.. అదే
బ్యానర్‌లోనే మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తాజాగా రాజ్ తరుణ్, అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన రెండో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో
రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.
ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న లాంచనంగా ప్రారంభించనున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న రాజుగాడు
సినిమా రిలీజ్‌కు రెడీ అవ్వగా, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
No comments:
Post a Comment