Saturday, 12 November 2016

fish pickel



చేపల తో ఊరగాయ
Image result for chepala pachadi
కావలసిన పదార్థాలు:
 చేపలు - అరకిలో,
లవంగాలు - 15,
దాల్చిన చెక్కలు - ఏడు,
 జీలకర్ర - నాలుగు టీ స్పూన్లు,
 ధనియాలు - రెండు టేబుల్‌ స్పూన్లు,
కుంకుమ పువ్వు - కొద్దిగా,
వెల్లుల్లిపాయ - ఒకటి,
కారం - రెండు టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు - తగినంత, నూనె - సరిపడా,
నిమ్మకాయలు - ఐదు. 
Image result for chepala pachadi
తయారుచేయు విధానం: 
నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి రెండవ రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చేపలో ముల్లులు తీసేసి మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగనిచ్చి దించేయాలి. అలాగే జీలకర్ర, ధనియాలు కూడా వేయించుకోవాలి. వీటిని మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిని కూడా రుబ్బి పెట్టుకోవాలి. స్టౌ మీద కళాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక చేప ముక్కల్ని వేసి వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి వేడి చల్లారకముందే వాటిపై మసాల పొడి, వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు వేయాలి. స్టౌ మీద కాగుతున్న నూనెని కూడా ఇందులో వేయాలి. వెడల్పాటి గరిటెతో చేప ముక్కల్ని కలపాలి. చివర్లో

No comments:

Post a Comment

Comments system