ఫ్రూట్ అండ్ కర్డ్ రైస్ రెసిపీ
కావలసిన పదార్థాలు:
అన్నం:
కప్పు,
పెరుగు:
కప్పు,
ద్రాక్ష:
స్పూను,
చక్కెర:
స్పూను,
ఉప్పు:
తగినంత,
చెర్రి
పళ్ళు: రెండు స్పూన్లు,
దానిమ్మ
గింజలు: రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిరపకాయలు:
రెండు లేదా మూడు(సన్నగా తరిగిపెట్టుకోవాలి),
బాదం:
గుప్పెడు(చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
ఆవాలు:
స్పూను, కొత్తిమీర: కొద్దిగా,
నూనె:
తగినంత,
తయారీ విధానం:ముందుగా గిన్నెలో అన్నం తీసుకుని దానికి పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ద్రాక్ష, చెర్రీ పళ్ళను కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు, పాలు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీ తీసుకుని నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు వేసి వేయించి దీన్ని అన్నానికి జత చేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాదంపలుకు, దానిమ్మ గింజలు, కొత్తిమీర పైన చల్లుకోవాలి.
No comments:
Post a Comment