Saturday, 26 November 2016

ustrasana yoga



ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ustrasana yoga)..
Image result for ustrasana yoga sex imagesసంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ (ధనురాసన)కు ఊర్ధ్వ శర భంగిమ (ఊర్ధ్వ ధనురాసన)కు మధ్యస్థంగా ఉంటుంది.
Related image
 మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచండి. కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనండి. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. 

మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు అలాగే ఉండిపోవాలి. తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి మామూలుగా నీలింగ్ పొజిషన్‌కి వెళ్లండి. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా చేతులను సడలించి నీలింగ్ పొజిషన్లో శరీరాన్ని గట్టిగా ఉంచండి.


ఉపయోగాలు...Image result for ustrasana yoga sex images

మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.
ఈ భంగిమను క్రమం తప్పకుండా చేస్తే ఫాటిగ్యూ, రుతుసంబంధ అసౌకర్యాన్ని, ఆత్రుతను నివారిస్తుంది.


No comments:

Post a Comment

Comments system