నయా ఫాషన్ రంగ్ రేజ్ డిజైన్
ఈ రోజుల్లో ఏం చేసినా ఫ్యాషనే. రోజుకో కొత్త ఫ్యాషన్
వస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అన్ని రకాల ఫ్యాషన్ ఐటమ్స్ లో, భారతీయ హస్తకళలు ఉట్టిపడేలా హ్యాండ్
పెయింటెడ్ జీన్స్ ఇంకా టీ షర్ట్స్ మార్కెట్ లో
సంచలనం సృష్టిస్తున్నాయని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. చేతితో
వేసే ఏ పెయింట్ అయినా అందంగానే ఉంటుంది. అదే పెయింట్ ని మనం వేసుకునే బట్టల మీద
చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. హస్తకళల సౌందర్యం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ
మార్కెట్ లో బోలెడన్ని డిజైన్స్ తో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి ఈ రంగ్ రేజ్ జీన్స్
అండ్ టీ షర్ట్స్.
రొటీన్ కి భిన్నంగా కనిపించే ఇలాంటి
పెయింటింగ్స్ చేసిన జీన్స్ ని ఎవరు కోరుకోకుండా ఉంటారు. అందుకే ఇవి
మార్కెట్లో తమ సత్తాని చాటుతున్నాయి.
కేవలం అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా ఎన్నో రకాల డిజైన్స్
తో మార్కెట్ లోకి వస్తున్నాయి ఈ రంగ్ రేజ్ కలెక్షన్స్. వయోలిన్ పెయింటింగ్, రకరకాల ఆకారాల్లో
ఉన్న కట్టడాలు చిత్రించిన టీ షర్ట్స్ ఇంకా ఎన్నోరకాల సరికొత్త
తరహా కలెక్షన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ట్రెండ్ కి తగ్గట్టు మీ స్టైల్ ని
మార్చాలనుకుంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వైపు ఒక చూపు వెయ్యాల్సిందే.
No comments:
Post a Comment