ఆడ వారి కోసం వంటింటి
చిట్కాలు
F సాంబారు, రసం
పొడులని డీప్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు వాసన
పోకుండా తాజాగా ఉంటాయి.
F పచ్చళ్ళు, ఉరగాయల్లో
స్టీల్ స్పూన్స్ వాడకూడదు.
F కోడి
గుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు స్పూన్ల పాలు కలపాలి.
F ఉల్లిపాయలు
గ్రైండ్ చేసిన వెంటనే వాడేయాలి. ఆలస్యమైతే చేదు గా అవుతుంది. అలాగే గ్రైండ్ చేసే
ముందు ఉల్లిపాయలను నూనె లో వేయిస్తే ఎక్కువ సేపు తాజా గా ఉంటాయి.
F క్యారెట్
వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం వేస్తే రంగు ఆకర్షనీయం గా ఉంటుంది.
F
వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూన్ పాలు కలిపిన
నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు.
F
బంగాళదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు
వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్ ని ఉంచాలి.
F
క్యారెట్ పై భాగాన్ని కోసేసి గాలి దూరని కవర్
లో పెట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజా గా ఉంటాయి .
F
టమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లు గా
ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
F
1బెండకాయలు
జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూన్ పెరుగు కాని
కలపాలి.
F
11కాఫీ
కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తరువాత కడగాలి.
No comments:
Post a Comment