జయలలితకు రోబోటిక్ థెరపీ.......?
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె త్వరలో
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.
జయమ్మ సంపూర్ణంగా కోలుకున్నారని.. ఆమె డిశ్చార్జ్ అయ్యే అంశంపై నిర్ణయం
తీసుకోవాల్సింది జయలలితేనని ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో అపోలో
ఆస్పత్రికి రోబోటిక్ యంత్రం చేరుకుందని.. అదీ అమ్మ చికిత్స పొందుతున్న గదికే
దాన్ని తీసుకెళ్లినట్లు తమిళనాట వార్తలు వస్తున్నాయి.
సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో రోబోటిక్ థెరపీ
చికిత్సకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రోబోటిక్ థెరపీ చికిత్స ద్వారా అమ్మకు
చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న ఫిజియోథెరపీకి రోబోటిక్
థెరపీ కూడా జత కానుందని అపోలో వర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే.. జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధపడుతూ
సెప్టెంబరు 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి
చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కాలర్
మైకు ద్వారా కొన్ని నిమిషాలు మాట్లాడారని అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి
రెడ్డి వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆమె కీలక అవయవాల పనితీరు మెరుగ్గా ఉందని చెప్పారు.
జయలలితకు చికిత్సలో భాగంగా ప్రతిరోజూ కొద్దిసమయం
కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆమె స్టాటిక్, యాక్టివ్ ఫిజియోథెరపీ తీసుకుంటుండటంతో కొన్ని రోజుల్లో ఆమె లేచి నిలబడి,
నడుస్తారని చెప్పారు.
No comments:
Post a Comment