అలర్జీని దూరం చేసుకోవాలంటే.. తీసుకోవలసిన జాగ్రతలు
అలర్జీని దూరం చేసుకోవాలా.. పుదీనా తీసుకోవాల్సిందేనని
ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలెర్జీ అనేది శరీరానికి పడని ఆహారం తీసుకోవడంతో పాటు
వేడితో ఏర్పడేది. అలెర్జీతో దురదలు, అవిశ్రాంతి, అసౌకర్యం ఏర్పడుతుంది.
అలెర్జీతో శ్వాసకోశాల్లో సమస్యలు, చర్మాలు, బ్లడ్ సెల్స్‌కు దెబ్బ తప్పదు.
అందుచేత ఆరోగ్యంగా అలెర్జీకి దూరంగా ఉండాలంటే... శెనగలు, బఠాణీలు
వంటి ధాన్యాలు అలెర్జీని ఏర్పరుచుతాయి. కోడిగుడ్డు, శెనగలు,
గోధుమలు, బాదం పప్పు, చేపలు 90 శాతం అలెర్జీని ఏర్పరుస్తాయి. అలాగే
పిల్లల్లో కొన్ని చాక్లెట్స్ వలన అలెర్జీలు ఏర్పడతాయి.
చిప్స్, చైనీస్ వంటకాలు న్యూడిల్స్,
బజ్జీ, బోండా, పూరీ
వంటి నూనె పదార్థాలను పక్కనబెడితే అలెర్జీని నయం చేసుకోవచ్చు. ఇంకా అలెర్జీని దూరం
చేసుకోవాలంటే జీలకర్రను వేయించి పౌడర్‌ను నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం
కలుగుతుంది.
ఇంకా వారానికి మూడు సార్లు పుదీనా ఆకులను ఆహారంలో
చేర్చుకుంటే అలెర్జీని దూరం చేసుకోవచ్చు. పెరుగులో ఉప్పు కలిపి కీరదోసను రోజూ ఓ
కప్పు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు
అంటున్నారు.
No comments:
Post a Comment